నివర్ తుఫాన్ ప్రభావంతో ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలన్నీ నాశనమయ్యాయి. నెల్లూరు జిల్లాలో వరితోపాటు...ఆక్వాపంటకు నష్టం వాటిల్లింది. తీరప్రాంత నెల్లూరు జిల్లాలో మండలాలైన ఇందుకూరుపేట, విడవలూరు, చిల్లకూరు, వాకాడు, అల్లూరు, బోగోలు మండలాలలో చేపలు, రొయ్యల రైతులకు భారీ నష్టం వాటిల్లిందని మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు తెలిపారు. చేపలు 286 హెక్టార్లలో, రొయ్యలు 587 హెక్టార్లలో జిల్లాలో మొత్తం 778 హెక్టార్లలో పంట దెబ్బతిందని ఆయన తెలిపారు.
పెన్నా నదిలో నీరు ఎక్కువగా రావడంతో వరద ధాటికి ఇలా అయ్యిందని ఆయన అన్నారు. పెన్నా తీరప్రాంతాలలో వలలు, బోట్లు భారీగా కొట్టుకుపోయాయని.. దీంతో 17 లక్షల వరకు నష్టం వాటిల్లుతుందన్నారు. మొత్తం 33 కోట్ల రూపాయలని ప్రాథమిక అంచనా వేశామని ఆయన తెలిపారు. రైతులకు పరిహారం ఈనెలాఖరులో ప్రభుత్వం చెల్లిస్తుందని తెలియజేశారు.
ఇదీ చూడండి. ఈ-పంట...నమోదు కాలేదంట..!