నెల్లూరులో ఎమర్జెన్సీ కంట్రోలింగ్ సెంటర్ నుంచి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న కరోనా బాధితులతో జూమ్‌యాప్ ద్వారా మంత్రి ఆళ్ల నాని దృశ్యమాధ్యమం లో మాట్లాడారు. జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు . రాష్ట్ర వ్యాప్తంగా 138ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను కొవిడ్ ఆసుపత్రులుగా వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు . మైల్డ్ కోవిడ్ ఉన్న వారికి మరో 109కొవిడ్ కేర్ సెంటర్లు ను గుర్తించామని.. కరోనా బాధితుల కోసం 56వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్, కలెక్టర్ చక్రధర్ బాబు ఈ చర్చలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: టిక్‌టాక్ కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్!