రాష్ట్ర ప్రభుత్వం పసుపు పంటకు రూ.10వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం లింగమనేనిపల్లిలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య మాట్లాడుతూ... ఎకరం పసుపు పంట సాగుకు లక్షా 20 వేల పెట్టుబడి అవుతోందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం క్వింటాకు రూ. 6,850 మద్దతు ధర ఇస్తోందని... దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
రూ.10 వేలు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా పంట కొనుగోలు చేయాలన్నారు. అన్నదాతలు ఎంతో వ్యయప్రయాసలకోర్చి యార్డుకు తీసుకొచ్చారని.. అలాంటప్పుడు ఏవో చెప్పి వెనక్కి పంపడం సరికాదన్నారు. సాంకేతిక కారణాలతో ఈ- కర్షక్లో పేరు నమోదు కాని రైతుల నుంచి కూడా పంటను కొనుగోలు చేయాలని కోరారు.
ఇవీ చదవండి.. 'ఆ నలుగురు'... అనాథల అంతిమ సంస్కారాలకు అండగా..!