ETV Bharat / state

16 ఏళ్ల క్రితం నాటి తీర్పును రద్దు చేసిన హైకోర్టు.. డిప్యూటీ సర్వేయర్​కు శిక్ష

author img

By

Published : Feb 17, 2023, 9:25 PM IST

High Court: లంచం డిమాండ్‌ చేసిన కేసులో డిప్యూటీ సర్వేయర్‌ను.. దిగువ కోర్టు(అనిశా) నిర్దోషిగా ప్రకటిస్తూ 16 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. అనిశా చట్టం కింద అప్పటి డిప్యూటీ సర్వేయర్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, 10వేల జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.

High Court
High Court

High Court: నెల్లూరు జిల్లాకు చెందిన గోరంట్ల వీరయ్యచౌదరి అనే వ్యక్తి ఆయన సోదరుడికి కామినేనిపాలెంలో ఉన్న 5.30 ఎకరాలను విక్రయించారు. పక్కపక్కనే ఇరువురికి భూములు ఉండటంతో సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలని కోరుతూ 2001 సెప్టెంబర్లో నెల్లూరు జిల్లా దగదర్తి ఎమ్మార్వోకి వినతి సమర్పించారు. ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ సర్వేయరుగా పనిచేస్తున్న నిమ్మకాయల విజయకుమార్‌ సర్వే నిర్వహించిన నివేదిక ఇవ్వలేదని వీరయ్యచౌదరి ఆరోపించారు. నివేదిక కోసం విజయకుమార్‌ను ఆశ్రయించగా రూ. 15వేల లంచం డిమాండ్‌ చేశారన్నారు. అంత చెల్లించలేనని చెప్పడంతో రూ.8వేలకు కుదించారన్నారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని వీరయ్యచౌదరి అనిశా అధికారులను ఆశ్రయించారు. దీంతో 2002 సెప్టెంబరు 16న లంచం తీసుకుంటుండగా విజయకుమార్‌ను పట్టుకున్నారు.

ఈ వ్యవహారంపై నమోదు అయిన కేసును విచారించిన నెల్లూరు అనిశా కోర్టు.. నేరనిరూపణ కాలేదని పేర్కొంటూ విజయకుమార్‌పై కేసును కొట్టేస్తూ 2007 పిబ్రవరి 26న తీర్పు ఇచ్చింది. నిర్దోషిగా ప్రకటించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ అనిశా జులై 2007లో హైకోర్టులో అప్పీల్‌ వేసింది. హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. అనిశా తరఫున న్యాయవాది ఎస్‌ఎం సుభానీ వాదనల వినిపించారు. కేసును కొట్టేయడానికి దిగువ కోర్టు పేర్కొన్న కారణాలు బలహీనంగా ఉన్నాయన్నారు. ప్రాసిక్యూషన్‌ కోర్టు ముందు ఉంచిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో దిగువ కోర్టు విఫలమైందన్నారు. డిప్యూటీ సర్వేయరు తరఫు నాయ్యవాది వాదనలు వినిపిస్తూ.. సర్వే నిర్వహణ కోసం ఫిర్యాదుదారుడు చట్టబద్ధంగా దరఖాస్తు చేయలేదన్నారు. సర్వే నిర్వహించే ప్రస్తావనే రాదన్నారు. అలాంటప్పుడు నివేదిక అనుకూలంగా ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేశారనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.

అనిశా కోర్టు లోతైన విచారణ జరిపి సర్వేయరును నిర్దోషిగా ప్రకటించిందన్నారు. అనిశా దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేయాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. లంచం డిమాండ్‌ చేశారని స్పష్టం చేశారు. నెల్లూరు అనిశా ప్రత్యేక కోర్టు.. సాక్ష్యాధారాలను సరైన దృష్టితో చూడలేదన్నారు. నేరనిరూపణ చేయడంలో ప్రాసిక్యూషన్‌ పొరపాటు పడిందన్నారు. నిర్దోషిగా ప్రకటిస్తూ 2007 ఫిబ్రవరిలో అనిశా కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేశారు. అనిశా చట్టం సెక్షన్‌ 7 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ సెక్షన్‌ 13(1)(డి) కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని స్పష్టత ఇచ్చారు. తగు చర్యల నిమిత్తం తీర్పు ప్రతిని సంబంధిత కోర్టుకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.