నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి కలకత్తాకు వలస కూలీలతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలు కాగా.. కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో డివైడర్ను డ్రైవర్ ఢీకొట్టటంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: