నెల్లూరు జిల్లా తెలుగుగంగ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఎం. లక్ష్మీనరసింహ ఇంటిపై అనిశా అధికారులు దాడులు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగంపై అధికార్లు ఈ సోదాలు చెపట్టారు. నెల్లూరు, కావలి, ప్రకాశం, తూర్పుగోదవరి జిల్లాల్లో తనిఖీలు చెపట్టారు. లక్ష్మీ నరసింహ పేరిట 14 ఎకరాల పొలం ఉన్నట్లు గుర్తించారు. నెల్లూరులో రూ.లక్ష బంగారం, రూ.18 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కావలిలో షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి:మైలవరం పంచాయతీరాజ్ ఏఈఈ సుబ్బయ్య ఇంట్లో అనిశా సోదాలు