ETV Bharat / state

ఏపీఎస్పీడీసీఎల్ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో నెల్లూరు ఏపీఎస్పీడీసీఎల్ ల్లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నెమళ్ళపూడి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు.

నెల్లూరులో ఏసీపీ దాడులు
author img

By

Published : Feb 5, 2019, 4:45 PM IST

నెల్లూరులో ఏసీపీ దాడులు
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో నెల్లూరు ఏపీఎస్పీడీసీఎల్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నెమళ్ళపూడి ప్రభాకర్ రెడ్డి ఇంటి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరులోని ప్రభాకర్ రెడ్డి ఇంటితో పాటు, ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం, చిట్టమూరు మండలంలోని ఆయన మామ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య కళ్యాణి పేర్లతో 9 ఇళ్ల స్థలాలు, ఒక బహుళ అంతస్తుల భవనం, కారు, రెండు స్కూటర్లు ఉన్నట్లు గుర్తించారు. మామ వాసుదేవా రెడ్డి పేరుతో 26 ఎకరాల భూమి, ఓ స్థలం, అత్త సుగుణమ్మ పేరుతో మరో స్థలంకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అర కేజీ బంగారు నగలు, రెండు కిలోల వెండి వస్తువులతో పాటు కొంత నగదు బయటపడగా, రెండు లాకర్లు తెరవాల్సి ఉంది. ప్రభాకర్రెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
undefined

Intro:Ap_Nlr_01_05_Acb_Raid_Kiran_Avb_C1

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో నెల్లూరు ఏ.పీ.ఎస్.పి.డి.సి.ఎల్.లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నెమళ్ళపూడి ప్రభాకర్ రెడ్డి ఇంటి పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరు నగరం వనంతోపు సెంటర్ దగ్గరున్న ప్రభాకర్ రెడ్డి ఇంటి తో పాటు, ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం, చిట్టమూరు మండలంలోని మామ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య కళ్యాణి పేర్లతో 9 ఇళ్ల స్థలాలు, ఒక బహుళ అంతస్తుల భవనం, కారు, రెండు స్కూటర్లు ఉన్నట్లు గుర్తించారు. మామ వాసుదేవా రెడ్డి పేరుతో 26 ఎకరాల భూమి, ఓ స్థలం, అత్త సుగుణమ్మ పేరుతో మరో స్థలంకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అర కేజీ బంగారు నగలు, రెండు కిలోల వెండి వస్తువులతో పాటు కొంత నగదు బయటపడగా, రెండు లాకర్లు తెరవాల్సి ఉంది. ప్రభాకర్రెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ధర ప్రకారం వీటి విలువ ఒకటిన్నర కోటి ఉంటుందని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
బైట్: శాంతో, ఏసీబీ డీఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.