గ్యాస్ సిలిండర్ పేలి ఓ పూరిల్లు కాలి బూడిదైన సంఘటన ఏఎస్‌పేట మండలం చిరమనలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఇంట్లో సిలిండర్ పేలి దట్టమైన మంటలు వ్యాపించాయి. ప్రమాదం ధాటికి సిలిండర్ 200 మీటర్ల దూరంలో పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి వెంటనే మంటలను అదుపు చేశారు. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లు పూర్తిగా కాలిపోయిందని.. సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన చెందారు.
దుకాణంలో షార్ట్ సర్క్యూట్..
![fire accident at hairar shop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12207205_asfd.jpg)
డి.సి.పల్లిలోని హైరర్స్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు దుకాణం యజమానికి సమాచారం అందించి, మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం దుకాణంలోని అలంకరణ సామగ్రి, 300 కుర్చీలు, లైటింగ్ బోర్డులు తదితర సామగ్రి కాలి బూడిదైనట్టుగా యజమాని గుర్తించారు. ప్రమాదంలో రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని దుకాణం తెలిపారు. మరోవైపు.. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తపడ్డారు.
ఇదీ చదవండి: