ETV Bharat / state

దారుణం.. 13 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి - బాలికపై 50 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి

13ఏళ్ల బాలికను 50 ఏళ్ల వృద్ధుడు చట్ట విరుద్ధంగా వివాహం చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నట్లు నెల్లూరు దిశ​ పోలీస్​స్టేషన్​ డీఎస్పీ నాగరాజు వెల్లడించారు.

a old man rape attempt on 13 years old girl
13ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి
author img

By

Published : Feb 27, 2021, 10:11 PM IST

కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు

నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13ఏళ్ల బాలికను 50 ఏళ్ల వృద్ధుడు చట్టవ్యతిరేకంగా వివాహం చేసుకొని లైంగిక దాడికి పాల్పడినట్లు నెల్లూరు దిశ​ పోలీస్​స్టేషన్​ డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు.

'నెల్లూరు నగరం కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య.. ఇసుకపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం విడవలూరు మండలం దంపూరు గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి పాల్పడగా.. భయాందోళనకు గురైన ఆ బాలిక.. కేకలు పెట్టడంతో గమనించిన స్థానికులు బాలికను రక్షించారు. సమాచారం అందగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. బాధితురాలిని ఐసీడీఎస్ హోంకు తరలించారు. నిందితునిపై కేసు నమోదు చేశాం' -నాగరాజు, డీఎస్పీ

మూడు రోజుల క్రితం జరిగిన వివాహ ఘటనపై ఫోక్సో చట్టం కింద దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు చిన్న సుబ్బయ్య కోసం మూడు బృందాలతో గాలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.

బాలిక తల్లే పెళ్లి చేసింది.. !

బాలిక తల్లే డబ్బు కోసం ఈ పెళ్లి చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆమె పెద్ద కుమార్తె అనారోగ్యంతో హాస్పిటల్​లో చికిత్స పొందుతుండగా వైద్య ఖర్చుల కోసం రూ. పదివేలు తీసుకొని వివాహానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: తల్లిని దారుణంగా హతమార్చిన కుమార్తె.. కారణం..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.