నెల్లూరు జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలోని కొవిడ్ టీకా కేంద్రంలో రెండో విడత వ్యాక్సినేషన్‌ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అందరూ టీకా తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
రెండో విడతలో 128 సెషన్ సైట్స్ అదనంగా ఏర్పాటు చేశారు. 31,200 మందికి వ్యాక్సినేషన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి సెషన్ సైట్లో 150 మందికి ఇచ్చే విధంగా ప్రణాళికులు రూపొందించారు. మొదటి విడతతో 66శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. 29,500మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించగా... ఇప్పటికే 19,538 మందికి పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల