నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టిట్కో అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో సుమారు 300 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారున్నారు. వారిలో కొంత మందికి కరోనా పరీక్షలు చేయగా 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని నెల్లూరులోని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదీ చదవండి: నాయుడుపేటలో ఆరోగ్య మిత్ర యువకుడికి కరోనా పాజిటివ్