రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా, 104 ఉద్యోగులు నెల్లూరు జిల్లా ఉదయగిరి సమావేశమైయ్యారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ, ఆర్ఓఆర్ ద్వారా గత 12 సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించి, ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలన్నారు. 104 సేవలను ప్రైవేట్ సంస్థలుక అప్పగించకుండా వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'తక్కువ వ్యవధిలో ఎక్కువ అపకీర్తి తెచ్చుకున్న ప్రభుత్వం'