75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో వంద అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన త్రివర్ణపతాకాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రారంభించారు.
జాతీయ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్య్ర స్ఫూర్తిని వివరించారు. ప్రజలు, ఉద్యోగుల్లో దేశభక్తిని పెంపొందించి, జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని కోరారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు.
ఇదీ చదవండి:
SUICIDE: పిడుగురాళ్లలో దారుణం..ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య