ETV Bharat / state

ఎదురుచూసి విసిగిపోయారు... సొంతంగా వంతెన నిర్మించుకున్నారు.. ఎక్కడంటే

author img

By

Published : Oct 13, 2022, 10:38 PM IST

BAMBOO STICKS BRIDGE : అది గిరిజనం చేత.. గిరిజనం కొరకు.. గిరిజనమే నిర్మించుకున్న వంతెన.. మరి ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చేస్తోంది అనేగా మీ సందేహం.. అడవి బిడ్డలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామన్న ప్రభుత్వం.. వాళ్ల కోసం రూ.7 లక్షలు ఖర్చు చేయలేకపోయింది. చివరకు ఖర్చు చేస్తుందన్న ఆశ చచ్చిపోయింది.. ఎదురుచూసీ చూసీ విసిగిపోయిన ఆ అడవి బిడ్డలు.. వెదురు కర్రలతో సొంతంగా వంతెన నిర్మించుకున్నారు.

bamboo bridge
bamboo bridge

BRIDGE : వర్షం కురిసినప్పుడల్లా గిరిజనుల పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. వానలు వస్తే గెడ్డెలు పొంగిపొర్లుతాయి. కానీ ఏ చిన్న అవసరమొచ్చినా ఈ గెడ్డ దాటడం తప్ప.. ఆరు గిరిజన గ్రామాలకు మరో దారి లేదు. పార్వతీపురం మన్యం జిల్లా.. కురుపాం మండలం గొటివాడ పంచాయతీ కేంద్రం నుంచి బోరి బండిగూడ, బల్లేరు, బల్లేరు గూడ, బోరుగూడ, కిడికేసు, నిడగల్లుగూడ గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే గెడ్డ దాటక తప్పని పరిస్థితి. ఈ గిరిజన గూడేల్లోని పిల్లలు చదువుకోవాలన్నా.. ఇది దాటుకుని.. గొటివాడ రావాల్సిందే. ఇక్కడ వంతెన లేకపోవడంతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. సాధారణ సమయాల్లో అయితే ఎలాగోలా ముందుకు సాగినా వర్షాలు కురిసినప్పుడు మాత్రం.. పెద్దవాళ్లు కూడా అటు వెళ్లేందుకు సాహసించరు. ఇక పిల్లలైతే.. మళ్లీ గెడ్డ ఉద్ధృతి తగ్గేవరకూ బడికి దూరం కావాల్సిందే.

ఇక్కడో చిన్న వంతెన కట్టించి ఈ పరిస్థితులు నుంచి గట్టెక్కించండి మహా ప్రభో అంటూ.. స్థానికులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. గతంలో 7లక్షల రూపాయలతో వంతెన నిర్మిస్తామని అధికారులు చెప్పినా.. ఆ హామీ అమలు కాలేదు. విసిగిపోయిన ఆయా గూడేల గిరిజనం.. సొంతంగా వెదురుకర్రలతో ఇలా చిన్న వంతెన నిర్మించుకుంది. పిల్లల చదువులు, తమ అవసరాలు ఆగకూడదని ఇలా తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నామని గ్రామస్థులు చెప్తున్నారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గొప్పలు చెప్పారేగానీ.. వంతెన మాత్రం కట్టించలేదని మండిపడుతున్నారు.

గిరిజనులు నిర్మించుకున్న వెదురు వంతెన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.