పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నేరెడు మానుగూడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై అన్నదమ్ములు ప్రాణాలు విడిచారు. గ్రామానికి చెందిన బిడ్డిక మాధవి తన ఇద్దరు కుమారులు రావేంద్ర(22) రాంప్రసాద్(20)తో కలిసి పొలం పనులకు వెళ్లారు. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురవటంతో వారు పక్కేన ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లారు.
ఆ సమయంలో ఇంటికి దగ్గర్లో పిడుగుపడటంతో ముగ్గురు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా.. రావేంద్ర, రాంప్రసాద్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి మాధవి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు మృతిచెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విజయనగరం జిల్లా నాతవలస జాతీయ రహదారి టోల్గేట్ సమీపంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు శంకర్రావు టోల్గేట్ వద్ద సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవీ చూడండి :