ETV Bharat / state

TDP Cheif Chandrababu Projects Tour: ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రుణం తీర్చుకుంటా.. గిరిజనులకు చంద్రబాబు హామీ..

TDP Cheif Chandrababu Projects Tour: తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాను చేసే పోరాటం ఆగదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. కౌరవ సభగా మారిన అసెంబ్లీని మళ్లీ గౌరవసభగా మారుస్తానని స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో సోలార్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి, యూనిట్ విద్యుత్ 3కే అందిస్తామని అన్నారు. ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ ప్రాంత రుణం తీర్చుకుంటానని పార్వతీపురం బహిరంగసభలో చంద్రబాబు హామీ ఇచ్చారు.

TDP_Cheif_Chandrababu_Projects_Tour
TDP_Cheif_Chandrababu_Projects_Tour
author img

By

Published : Aug 10, 2023, 7:31 AM IST

Chandrababu Visited Thotapalli Project: రాష్ట్రానికి రెండు కళ్లైన అమరావతి, పోలవరాన్ని సీఎం జగన్ పొడిచేసి.. ఆంధ్రప్రదేశ్‌ను.. అంధప్రదేశ్‌గా మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రహదారిలో.. గుంత పడితే మట్టి వేయలేని సీఎం.. 3 రాజధానులేం కడతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి తన సేవలు అవసరమో లేదో గుర్తించి కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు. ఉత్తరాంధ్ర పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి.. ఆ ప్రాంత రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.

వైసీపీ ఆరిపోయే దీపమని.. ఎక్కువ రోజులు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా 9వ రోజు.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో చంద్రబాబుకు అడుగడుగునా పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆయన.. పార్వతీపురం బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జగన్ అరాచకాలను భరించే స్థితిలో రాష్ట్రం లేదన్నారు. మన రాజధాని అమరావతేనంటూ.. ప్రజలతో గట్టిగా నినదింపచేశారు.

TDP Cheif Chandrababu Projects Tour: ఉత్తరాంధ్రలో 13 ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది: చంద్రబాబు

Chandrababu Selfie Challenge at Thotapalli Project: అంతకుముందు కురుపాం నియోజవర్గంలోని సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీని చంద్రబాబు పరిశీలించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా.. గోదావరి నీళ్లు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపితే.. కరవు ఉండదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో13 ప్రాజెక్టులను వైసీపీ నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు సందర్శన తర్వాత.. రైతులతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తోటపల్లి ద్వారా లక్షా 80వేల ఎకరాలకు నీరు పారాల్సి ఉండగా.. కాల్వలు మరమ్మతులు చేయించకపోవడంతో భూములకు నీరందడంలేదని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్ వద్ద.. చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు.

Chandrababu Reaction on Attempt to Murder Case: నాపైనే దాడి చేసి.. హత్యాయత్నం కేసా..?: చంద్రబాబు

Chandrababu RoadShow: రాష్ట్రంలో ఇతర కాంట్రాక్టర్లకు డబ్బులివ్వకుండా ఏడిపిస్తున్న జగన్‌.. పెద్దిరెడ్డికి మాత్రం బిల్లులు క్లియర్‌ చేస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి అవినీతిని బయటపెట్టాననే కక్షతోనే, తన మీద దాడి చేసి తిరిగి హత్యాయత్నం కేసు పెట్టారని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతల వల్ల తనకు తీవ్ర అన్యాయం జరిగిందని జ్యోతి అనే గిరిజన మహిళ చంద్రబాబు వద్ద కన్నీరు మున్నీరయ్యారు. మాజీమంత్రి పుష్పశ్రీవాణి తన రేషన్ డిపోను రద్దు చేయించారని వాపోగా.. చంద్రబాబు ఆమెను సముదాయించారు.

TDP Leaders Fire on CM Jagan : 'షేమ్ ఆన్ యూ జగన్ రెడ్డీ..' చర్యకు ప్రతి చర్య తప్పదని టీడీపీ హెచ్చరిక

CBN Tour on Destruction of Irrigation Projects: ఐటీడీఏలు నిర్వీర్యం అవుతున్నాయని గిరిజనులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట చంద్రబాబు చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటన నేటితో ముగియనుంది. 9 రోజుల పాటు 2వేల 500 కిలోమీటర్ల మేర పర్యటించిన చంద్రబాబు.. నేడు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార-నాగావళి లింక్‌ కెనాల్‌ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించనున్నారు. సాయంత్రం కొత్తూరు మండలం గుణభద్ర గ్రామంలో రోడ్‌ షో నిర్వహిస్తారు.

TDP Chief Chandrababu Selfie Challenge at Thotapalli Project: తోటపల్లి ప్రాజెక్టు వద్ద చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.