Asha workers: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశా, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు రెండో రోజూ ఆందోళన కొనసాగించారు. రెండో రోజు నిరసనలో భాగంగా ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సమస్యలు పరిష్కరించాలంటూ.. ఆశాలు, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా ఆశా, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, ఐటీడీఏ కార్యాలయంలో చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఇవీ చూడండి: