ETV Bharat / state

గౌరవం లేదు.. విధులకు అడ్డొస్తున్నారు.. తహసీల్దార్​కు దళిత సర్పంచ్​ వినతి పత్రం

author img

By

Published : Sep 29, 2022, 9:27 PM IST

Women Sarpanch Protest: మహిళ సర్పంచ్​ విధులు నిర్వహించకుండా కొందరు అధికార పార్టీ నాయకులు అడ్డు తగులుతున్నారు. కనీసం గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి రానివ్వటం లేదని ఆ మహిళ సర్పంచ్​ వాపోయింది. తనకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఇదే విషయంపై ఆమె గతంలో జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించారు.

Women Sarpanch Protest
మహిళ సర్పంచ్​ నిరసన

Woman Sarpanch: అధికార పార్టీ నాయకులు తనను విధులు నిర్వహించకుండా అడ్డు తగులుతున్నారని ఓ మహిళా సర్పంచ్​ నిరసన చేపట్టారు. తాను దళిత సర్పంచ్​ కావటం వల్లే అడ్డు తగులుతున్నారని ఆమె వాపోయారు. ఈ మేరకు ప్రజా సంఘాలు, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఆమెకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు తహసీల్దార్​కు వినతి పత్రం అందించారు.

పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని అత్తలూరు గ్రామానికి చెందిన బంకా సరోజిని సర్పంచ్​గా పోటి చేసి గెలుపొందారు. అయితే గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు తనని పంచాయతీ కార్యాలయంలోకి రాకుండా అడ్డు తగులుతున్నారని వాపోయింది. పంచాయతీ అధికారులకు సైతం వారే విధులు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనని అసభ్యంగా దూషిస్తున్నారని.. కనీసం సర్పంచ్​ననే గౌరవం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఆమెపై అధికారం చలాయిస్తున్న నాయకులపై చర్యలు తీసుకోవాలని.. అమరావతి తహసీల్దార్ విజయశ్రీకి వినతి పత్రం అందించారు.

గతంలో జిల్లా ఎస్పీని కలిసిన సర్పంచ్​: గతంలో కూడా అత్తలూరు గ్రామ సర్పంచ్​ ఇదే సమస్యపై పల్నాడు జిల్లా ఎస్పీని కలిశారు. తన విధులకు కొందరు అధికార పార్టీ నాయకులు అటంకం కలిగిస్తున్నారని.. తానను గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి రానివ్వటం లేదని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కనీసం గ్రామ పంచాయతీలో తనకు గుర్తింపు లేదని.. ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఎస్పీకి అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

విధులకు కొందరు వైకాపా నాయకులు అడ్డువస్తున్నారని దళిత సర్పంచ్​ నిరసన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.