ETV Bharat / state

ఎస్ఈబీ కార్యాలయంపై మహిళలు దాడి.. కుర్చీలు, ఫర్నీచర్‌ ధ్వంసం - Women attack on Macharla SEB office

పల్నాడు జిల్లా మాచర్ల ఎస్ఈబీ కార్యాలయంపై మహిళలు దాడి చేశారు. నాటుసారా కేసులో రాజు అనే వ్యక్తిని ఎస్​ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని అక్రమంగా అరెస్టు చేశారని కార్యాలయంపై రాజు కుటుంబీకులు దాడి చేశారు.

ఎస్ఈబీ కార్యాలయంపై మహిళలు దాడి
ఎస్ఈబీ కార్యాలయంపై మహిళలు దాడి
author img

By

Published : Jun 2, 2022, 6:29 PM IST

ఎస్ఈబీ కార్యాలయంపై మహిళలు దాడి.. కుర్చీలు, ఫర్నీచర్‌ ధ్వంసం

పల్నాడు జిల్లా మాచర్లలోని సెబ్​ కార్యాలయంపై మహిళలు దాడి చేశారు. నాటుసారా తయారీ కేసులో రాజు అనే వ్యక్తిని సెబ్​ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. అతని కోసం భార్య జ్యోతి చంటిబిడ్డతో స్టేషన్ వద్దకు వచ్చింది. రాజును అన్యాయంగా అరెస్టు చేశారని.. కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజును విడుదల చేయాలని కోరారు.

పోలీసులు పట్టించుకోకపోవటంతో అక్కడ ఉన్న కుర్చీలు, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలు కిందపడేశారు. రాజును పీడీ యాక్ట్ కింద అరెస్టు చేశామని సెబ్​ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: జానీ డెప్​-అంబర్​ హెర్డ్​.. ప్రేమ కథ నుంచి కోర్టు దాకా.. వయా ఎలాన్ మస్క్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.