TDP three-member team talks with Kodela Sivaram : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోడెల శివరాంతో టీడీపీ త్రిసభ్య బృందం చర్చలు జరిపింది. కన్నా లక్ష్మీనారాయణకు నియోజకవర్గ ఇంచార్జి ఇవ్వటంపై కోడెల శివరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ త్రిసభ్య బృందం శివరాంని కలిసింది. సమావేశం అనంతరం నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. కోడెల కుటుంబానికి న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. సామాజిక సమీకరణల దృష్ట్యా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించారని స్పష్టం చేశారు. శివరాంతో పాటు కోడెల అభిమానులకు కొంత బాధ ఉంటుందని... దాన్ని తీర్చేందుకు పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కోడెల శివరాంను చంద్రబాబు త్వరలో పిలిపించుకుని మాట్లాడతారని జీవీ ఆంజనేయులు చెప్పారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. శివరాంతో మాట్లాడి వెళ్లబోతున్న త్రిసభ్య బృందాన్ని శివరాం అనుచరులు కాసేపు అడ్డుకున్నారు. కార్ల ముందు బైఠాయించి.. శివరాంని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేస్తున్న శివరాం అనుచరులకు నచ్చజెప్పి నేతలు వెళ్లిపోయారు.
CBN Comments: 'టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం పూర్తయ్యేది.. జగన్ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం'
టీడీపీ సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా కన్నా లక్ష్మీ నారాయణను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక్కడున్న పరిస్థితులను బేరీజు వేసుకుని, సమీకరణాలను పోల్చుకుని, సత్తెనపల్లిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యాన చంద్రబాబు నాయుడు, టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. స్వర్గీయ కోడెల శివ ప్రసాద్ తనయుడు శివరాం, పార్టీ నేతలు, కార్యకర్తలు, శివరాం అనుయాయుల్లో కొంత బాధ, ఇబ్బంది ఉండడం సహజమే. మనసు కష్టంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడాలని మేం ఇక్కడకు వచ్చాం. శివరాం భవిష్యత్ నాయకుడిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు సహకారం తప్పనిసరిగా ఉంటుంది. భరోసా, భద్రత కల్పించేలా పార్టీ సహకరిస్తుందని చెప్తున్నాం. - నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
కోడెల శివ ప్రసాద్ పార్టీకి చేసిన సేవలు మర్చిపోలేనివి. ఆయన కుమారుడైన శివరాంకి కచ్చితంగా భవిష్యత్ ఉంటుంది. శివ ప్రసాద్ కి మంచి అవకాశాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి, పార్టీ బలోపేతానికి శివరాం కృషి చేయాలని కోరాం. అదే విధంగా కోడెల కుటుంబం అంటే మాకు ఎంతో అభిమానం. శివరాంకి ప్రత్యేకంగా సమయం ఇవ్వాలని కోరడంతో.. శివరాం మన కుటుంబ సభ్యుడు అని చంద్రబాబు నాయుడు చెప్తూ.. సరే అన్నారు. శ్రేణులు ఐకమత్యంగా ఉండాలని కోరుతున్నాం. - జీవీ ఆంజనేయులు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు
వచ్చే ఎన్నికల్లో వైసీపీని అడ్రస్ లేకుండా ఓడిస్తాం కన్నా లక్ష్మీనారాయణ