ETV Bharat / state

పండుగొచ్చింది.. ఊరంతా సందడి

Sankranti Special : పండగ వచ్చిందంటే మహిళలు ఈ వంట చేయాలి, ఆ వంట చేయాలంటూ నానా హైరానా పడిపోతుంటారు. చేసిన వంటకాలు బాగున్నాయా లేదా అని వేరొకరికి తినిపించే వరకు ఊరుకోరు. అది కేవలం ఎవరితో పోటీ లేకుండా వారు చేసిన వంట కోసమే ఇలా. మరీ అలాంటిది ఊరిలోని మహిళలంతా వంటల పోటీలో పాల్గొంటే ఎలా ఉంటుందంటే..

Cooking Competitions
వంటల పోటీలు
author img

By

Published : Jan 15, 2023, 12:54 PM IST

పల్నాడు జిల్లా ఎండుగుంపాలెం గ్రామంలో వంటల పోటీలు

Cooking Competitions : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పట్టణాలకు, సిటీలకు, విదేశాలకు వెళ్లిన వారందరూ సొంత గ్రామాలకు చేరుకుంటారు. ఎక్కడినుంచో సొంత ఇంటికి చేరుకున్న వారితో.. అంతసేపు మూగబోయిన గ్రామాలు సందడిగా మారతాయి. కుటుంబసభ్యులతో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగి స్వగ్రామానికి చేరుకోవటంతో.. ఊరంతా సందడిగా మారుతుంది. చుట్టుపక్కల వారి పలకరింపులు, బంధువుల ఆత్మీయత పండగ వేళ కనిపిస్తుంటుంది. ఇలానే పల్నాడు జిల్లాలోని ఎండుగుంపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.

సంక్రాంతి పండగను పురష్కరించుకుని గ్రామంలో వంటల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి అంటే పిండివంటలు. వీటిలో ప్రావీణ్యం ఉండే మహిళల కోసం ప్రత్యేకంగా.. పండగ వేళ నిర్వహించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన గ్రామస్థులు.. పండగకు సొంతూరికి తిరిగి రావటంతో ఈ పోటీలను నిర్వహించారు. ఊరు ఊరంతా కలిసి ఈ పోటీలలో పాల్గొనటంతో.. వంటల పోటీలు నిర్వహించిన ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రకరకాల పిండివంటలు చేశారు. సొంతూరిలో వంటల పోటీలో పాల్గొని వంటలు చేయటం ఎంతో ఆనందంగా ఉందని మహిళలు అంటున్నారు. గతంలో మూడు సంవత్సరాల క్రితం కూడా ఇదేవిధంగా పోటీలలో పాల్గొన్నామని మహిళలు అంటున్నారు. గతంలోకంటే ఇప్పుడు గొప్ప అనుభూతిని పొందామని అంటున్నారు.

"మేము హైదరాబాద్​లో ఉంటాము. మా ఆత్తగారిళ్లు ఎండుగుంపాలెం. పండగ కోసం మా స్వగ్రామానికి వచ్చాము. సంక్రాంతి సంబరాలను గ్రామాలలో ఎంతో ప్రాముఖ్యంగా నిర్వహిస్తుంటారు. అలాంటి సమయంలో మేము ఈ పోటీలలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉంది." - పోటీలో పాల్గొన్న మహిళ

శివశక్తి గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో ఈ వంటల పోటీలు ఏర్పాటు చేయగా.. విజేతలకు బహుమతులు అందించారు. గ్రామ పెద్దల పర్యవేక్షణలో ఈ పోటీలను నిర్వహించారు. గ్రామంలోని వారు కలిసి పండగ చేసుకున్నంత ఆనందం.. ఈ పోటీలను నిర్వహించటం ద్వారా వస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. సొంతూరికి వచ్చిన వారిని, పండగకు పుట్టింటికి వచ్చిన వారిని దృష్టిలో ఉంచుకుని పోటీలను ఏర్పాటు చేశామని వారు అన్నారు.

"అందరం కలిసి పోటీలలో పాల్గొంటే సంతోషంగా ఉంటుందని పోటీలు ఏర్పాటు చేశాము. వంటల పోటీలలో పాల్గొనటం వల్ల ఆట విడుపుగా ఉంటుందని ఏర్పాటు చేశాము. గతంలో మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాము. మళ్లీ ఇప్పుడు ఏర్పాటు చేశాము. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉత్సహంగా పాల్గొన్నారు." - నిర్వాహకులు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.