Fake Currency: పల్నాడు జిల్లా చర్లగుడిపాడుకు చెందిన ఓ వ్యక్తి నకిలీ నోట్లు తయారు చేస్తున్నాడనే అనుమానంతో అతని ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో నకిలీ నోట్లను గుర్తించి.. నోట్ల తయారికి వినియోగించిన ల్యాప్ట్యాప్, ప్రింటింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సుమారు 65 లక్షల రూపాయల విలువ గల ముద్రించిన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల రాకను గమనించిన సదరు వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన ఇంటి పైనుంచి పక్క ఇంటిపై దుకాడంతో.. అతనికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ఇవీ చదవండి: