ETV Bharat / state

భాజపా, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు : పవన్‌ కల్యాణ్‌ - మంత్రి అంబటి కాపుల గుండెల్లో కుంపటి

Janasena leader Pawan rythu bharosa yatra in Ap: వైకాపా సర్కారుకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటినీ ఏకం చేసి కొత్త ప్రభుత్వం స్థాపించడమే తన లక్ష్యమని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తేల్చిచెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాదని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో వైకాపా మరింతగా విధ్వంసం సృష్టించనుందన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాలని.. జనసైనికులకు పవన్‌ పిలుపునిచ్చారు.

పవన్‌ కల్యాణ్‌
Pawan rythu bharosa yatra
author img

By

Published : Dec 18, 2022, 4:50 PM IST

Updated : Dec 19, 2022, 6:40 AM IST

Pawan made allegations against ysrcp: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలో పర్యటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 280 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చెక్కులు అందజేశారు. కౌలు రైతులకు అన్యాయం జరుగుతున్నా ఆదుకోవడానికి ముందుకు రాని వైకాపా నేతలు, అధికారులు... సినిమా టికెట్లు, వారాహి వాహనం వంటి అంశాలపై అతిగా స్పందిస్తున్నారంటూ పవన్‌ ఎద్దేవా చేశారు.. ఇలాంటి విధానాలు మానుకోవాలని హితవుపలికారు.

280 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందజేత

తాను ఏం మాట్లాడినా వెంటనే వైకాపాలోని కాపు నాయకులు, మంత్రుల చేత తిట్టించడం అలవాటైపోయిందని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనెలా తిరుగుతానో చూస్తానంటూ వైకాపా నేతలు అంటున్నారని ధ్వజమెత్తారు. తనను వారాంతపు పొలిటీషియన్‌ అంటున్న వైకాపా నేతలకూ పవన్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. 2014 ఎన్నికల్లోలా తెలుగుదేశంతో జనసేన కూటమిలా ఉండి పోటీచేసి ఉంటే.. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదని, పవన్‌ అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓటును చీల్చబోమన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు.

వైకాపాపై వ్యతిరేకత ఉన్న పక్షాలన్నింటినీ ఒకవైపు తీసుకొచ్చి కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పకపోతే.. రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారడం ఖాయమని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చూడని కులాలను అధికార పీఠం ఎక్కించడమే జనసేన లక్ష్యమన్నారు. మాచర్లలో వైకాపా విధ్వంసాన్ని ప్రస్తావించిన పవన్‌ కల్యాణ్, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ మరిన్ని అరాచకాలకు పాల్పడబోతుందని చెప్పారు. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జనసైనికులు, వీర మహిళలకు పిలుపునిచ్చారు.

అంతకుముందు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పలువురు వైకాపా నాయకులు జనసేనలోకి చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోకవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు... తన అనుచరులతో కలసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో రాజోలు నుంచి వైకాపా తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. పి.గన్నవరం నియోజకవర్గం నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరు కొండలరావు, విజయనగరం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త గురాన అయ్యు కూడా జనసేనలో చేరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ వారికి సూచించారు.

'వైకాపా నేతలు, అధికారులు... సినిమా టికెట్లు, వారాహి వాహనం వంటి అంశాలపై అతిగా స్పందిస్తున్నారు. తాను ఏం మాట్లాడినా వెంటనే వైకాపాలోని కాపు నాయకులు, మంత్రుల చేత తిట్టించడం అలవాటైపోయింది. నేనెలా తిరుగుతానో చూస్తానంటూ వైకాపా నేతలు అంటున్నారు. తనను వారాంతపు పొలిటీషియన్‌ అంటున్నారు. 2014 ఎన్నికల్లోలా తెలుగుదేశంతో జనసేన కూటమిలా ఉండి పోటీచేసి ఉంటే.. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. రాబోయే ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓటును చీల్చబోమన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం.'- జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఇవీ చదవండి

Last Updated : Dec 19, 2022, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.