ETV Bharat / state

Crop insurance in Palnadu: 'పంట బీమా పరిహాసం'.. రైతులకు అన్యాయంపై చోద్యం చూస్తున్న వ్యవసాయ శాఖ యంత్రాంగం - స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ తెగులు

Crop insurance compensation in Palnadu district: పల్నాడు జిల్లాలో పంటల బీమా పరిహారం పరిహాసంగా మారింది. కంది, మిర్చి పంటలు వేసి నష్టపోయిన కొందరు రైతులకు బీమా పరిహారం అందక నిట్టూరుస్తున్నారు. పంట దెబ్బతిన్నాక సాంకేతికపరంగా కచ్చితంగానే నమోదు చేసుకున్నా బీమా రాకపోవడానికి కారణమేంటో అంతుపట్టడం లేదని రైతులు వాపోతున్నారు. తమ కష్టాలు చెప్పుకుందామన్నా... వ్యవసాయ అధికారులు తమను కన్నెత్తి చూడటం లేదని రైతులు వాపోతున్నారు.

రైతులకు అందని పంట బీమా
రైతులకు అందని పంట బీమా
author img

By

Published : Jul 25, 2023, 1:58 PM IST

రైతులకు అందని పంట బీమా

Crop insurance compensation in Palnadu district: పల్నాడు జిల్లాలో పంటల బీమా పరిహార జాబితా గందరగోళంగా మారింది. పంటలు పూర్తిగా దెబ్బతిన్నా.. పరిహారం జాబితాలో తమకు చోటుదక్కలేదని నూజెండ్ల, బొల్లాపల్లి మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూజెండ్ల మండలంలో అత్యధికంగా కందిపంట సాగుచేశారు. అధిక వర్షాలతోపాటు స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ తెగులుతో దిగుబడులు పడిపోయాయి. పాత పాలెం, కొత్తపాలెం గ్రామాల రైతుల ఫిర్యాదుపై స్పందించి లాం ఫారం శాస్త్రవేత్తలు, జిల్లా వనరుల కేంద్రం, జిల్లా వ్యవసాయ అధికారుల బృందం కలిసి క్షేత్రస్థాయిలో పంట పరిశీలించి సూచనలు చేసినా ఫలితం లేక దిగుబడులు దక్కలేదు. పెట్టుబడులు అందని పరిస్థితుల్లో పంటల బీమా వర్తిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు. తీరా ప్రభుత్వ బీమా పరిహార జాబితాలో రెండు మండలాల రైతులకు చోటులేకపోవడం రైతుల్ని విస్మయపరుస్తోంది.

వినుకొండ నియోజకవర్గంలో శావల్యాపురం, ఈపూరు, వినుకొండ మండలాల్లోని అతి తక్కువ మందికి పరిహారం జాబితాల్లో చోటు కల్పించారు. బొల్లాపల్లి, నూజెండ్ల మండలాల్లో అసలు పరిహారం రాలేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారుల నివేదికలు రైతులపాలిట శాపంగా మారాయి. ఈ-క్రాప్ నమోదు, ఈకేవైసీ ఆధారంగా గ్రామ, మండల యూనిట్ గా పంట దిగుబడులు నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అలా నివేదికలు చూసుకున్నా రెండు మండలాల రైతులకు బీమా వర్తిస్తుంది. వ్యవసాయ, అర్ధ గణాంక శాఖ అధికారుల పర్యవేక్షణలో కంది, మినుము, వరి, పెసర, ఆముదం పంటల్లో పంటకోత ప్రయోగాలు చేసి పంటనష్టం అంచనాలను సక్రమంగా లెక్కించినా కందిపంటకు పరిహార జాబితాలో రెండు మండలాల రైతులకు బీమా దక్కాల్సి ఉందని రైతులంటున్నారు.

గత ఏడాది వ్యవసాయ శాఖ రాయితీపై ఎల్ఆర్జీ -52 రకం విత్తనం పంపిణీ చేసింది. సాగు చేశాక స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ ఆశించడంతో పంట పూర్తిగా దెబ్బతింది. రికార్డుల ప్రకారం నూజెండ్ల మండలంలో 4,357.71, బొల్లాపల్లి మండలంలో 1785.6 ఎకరాల్లో కంది సాగైంది. ఇక కందితోపాటు మిర్చి సాగుచేసిన రైతులు కూడా నష్టపోయారు. వీరికి కూడా పరిహారం అందలేదు. కౌలుకు తీసుకుని పంట సాగుచేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయం. పెట్టుబడి నష్టపోగా... కౌలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా సక్రమంగానే పేర్లు నమోదు చేసుకుని, వేలిముద్రలు వేశామని.. పంట పరిహారం ఎందుకు రాలేదో తమకు అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయి పరిహారానికి నోచుకోని నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.