Foreign Duplicate Cigarette: అక్రమంగా రవాణా చేస్తున్న విదేశీ నకిలీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరెట్లను అధికారులు గుర్తించారు. బిహార్‌లోని ముజఫర్ నుంచి సరకు సరఫరా జరిగినట్లు కస్టమ్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మార్కెట్లో వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటనలో తెలిపారు. మయన్మార్ నుంచి ఈ సిగరెట్లు వచ్చి ఉంటాయని కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. పారిస్ అనే బ్రాండ్‌తో ఉన్న సిగరెట్ ప్యాకెట్లపై తయారు చేసిన తేదీ, స్థలము వంటి వివరాలు లేకపోవటం.. నిబంధనలు ప్రకారం ప్యాకెట్‌పై ఉండాల్సిన హెచ్చరిక ముద్ర లేదని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: