Bellamkonda ZPTC Comments: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుతోపాటు ప్రభుత్వంపై బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి అసమ్మతి గళం వినిపించారు. వైసీపీ కోసం తాను ఆస్తులు అమ్ముకుంటే.. ఇప్పుడు పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రోత్సహిస్తున్నారని వాపోయారు.
"నేను పార్టీ కోసం రూ.7కోట్లు ఖర్చుపెట్టాను. బంగారం తాకట్టు పెట్టి.. యాత్ర సినిమాని వారం రోజులపాటు ఆడించాను. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. నేను ఖర్చు పెట్టాను. కానీ ఇప్పుడు 'పార్టీలో ఉంటే ఉండు.. పోతేపో' అన్నట్టు వ్యవహరిస్తున్నారు". -గాదె వెంకటరెడ్డి, బెల్లంకొండ జెడ్పీటీసీ సభ్యులు
ఇవీ చదవండి: