ETV Bharat / state

'చిలకలూరిపేట' లో ఫ్యామిలీ డాక్టర్.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రజిని - చిలకలూరిపేట

Family Doctor Program : ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నెల 6న జరగనున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి విడదల రజిని పరిశీలించారు. సీఎం ముందుగా లింగంగుంట్ల గ్రామం చేరుకుని ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ శివ శంకర్ వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 4, 2023, 7:31 PM IST

Updated : Apr 4, 2023, 9:44 PM IST

Family Doctor Program : ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఈనెల ఆరవ తేదీ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి రజిని, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించి అధికారులతో సమీక్షించారు.

దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది... అనంతరం మీడియా సమావేశంలో మంత్రి రజిని మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం దేశంలోనే ఒక ఐకానిక్ గా నిలుస్తుంది అన్నారు. ఈ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెండు వేల జనాభాకు ఏర్పాటు చేసిన 10,032 వైఎస్ఆర్ విలేజి క్లినిక్ వద్దకు... నెలలో రెండుసార్లు 104 వాహనంలో పీహెచ్​సీ లోని ఒక వైద్యుడు వచ్చి గ్రామంలోని అవసరమైన అందరికీ వైద్య సేవలు మందులు ఉచితంగా అందిస్తారని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను, విలేజ్ క్లినిక్ వద్దకు రాలేని వారి ఇంటి వద్దకు వైద్యుడు నేరుగా వెళ్లి వైద్య సేవలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని చెప్పారు.

జిల్లా కలెక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ ఈనెల ఆరవ తేదీ సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం ముందుగా లింగంగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా వైయస్సార్ విలేజ్ క్లినిక్ వద్దకు వచ్చి ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని పరిశీలించి, డెమో ద్వారా ఈ పథకం పూర్తి వివరాలను తెలుసుకుంటారన్నారు. అనంతరం సభా వేదిక వద్దకు వచ్చి ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభిస్తారని వివరించారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఈ వైద్య విధానం మంచి కార్యక్రమం అన్నారు. సీఎం ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ కోరారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలవబోతుంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మన చిలకలూరిపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఈ మేరకు సీఎం గారికి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. - విడదల రజిని, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి

ఇవీ చదవండి :

Last Updated : Apr 4, 2023, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.