YSRCP Office in 200 Crore Worth Place : వైఎస్సార్సీపీ నేతల అరాచకాలకు రోజురోజుకూ అడ్డూ అదుపు లేకుండా పోతుంది. పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేస్తానంటారు. పార్టీ నేతలేమో విద్యార్థులకు ఉపయోగపడాల్సిన స్థలాన్ని కబ్జా చేస్తారు. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయానికి కేటాయించారు. అధికార పార్టీ పెద్దలు.. గుట్టుచప్పుడు కాకుండా ప్రతిపక్ష పార్టీల వాళ్లు వ్యతిరేకిస్తున్నా ఓ గుత్తేదారు సంస్థకు కార్యాలయం పనులు అప్పగించారు. దీనిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
YCP Office in Labor Department Place : సుమారు రెండున్నర ఎకరాల స్థలం, రూ. 200 కోట్లు విలువ చేసే జాగాని అధికార పార్టీ కార్యాలయానికి వైఎస్సార్సీపీ సర్కార్ కేటాయించింది. విజయవాడ భవానీపురం లేబర్ కాలనీకి ఆనుకుని ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ స్థలంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఓ గుత్తేదారు సంస్థకు కార్యాలయ నిర్మాణ పనులు అప్పగించి పనులు ప్రారంభించారు.
YSRCP Leaders Land Scam: ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణం.. వైసీపీ నాయకుల్లో మొదలైన అలజడి..
Oppositions Objection: కోట్ల రూపాయల విలువైన స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్థానికులు తమ ప్రాంతంలో కళాశాల నిర్మించాలని కోరుతున్నా పరిగణలోకి తీసుకోకుండా వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించడం సరైనది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జీవిస్తున్న ప్రజల్లో సుమారు 80 శాతం మంది పేద ప్రజలే.. వారి పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి అవసరమైన విధంగా కళాశాల ఈ ప్రాంతంలో నిర్మించాలని స్థానికులు వేడుకుంటున్నారు.
Demand for Degree College: వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించాలని భావించిన స్థలం చుట్టూ అధిక శాతం మంది రోజువారి కూలీలే నివసిస్తున్నారు. వారి పిల్లలకు వేల రూపాయలు ఫీజు చెల్లించి ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివించలేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. కొండ ప్రాంతంలో చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న భవానీపురం ప్రజలు తమకు కళాశాల నిర్మాణం చేపట్టాలని ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కర్నూలు వైసీపీ ఆఫీస్.. ఆర్టీసీ స్థలంపై నేతల కన్ను
ప్రజాసంఘాలు కళాశాల నిర్మాణం కోసం అనేక పోరాటాలు చేపట్టాయి. అయినా అధికార పార్టీ నేతలకు కనీసం చీమకుట్టినట్లు అనిపించడం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవేమి పట్టించుకోని జగన్ సర్కార్ పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేసి.. వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ పేదల సీఎం ఐతే కాలేజీ నిర్మించాలి : "ఇక్కడ ఉన్న రెండున్నర ఎకరాల స్థలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని మేము కోరాం. విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని అంటున్న జగన్ మోహన్ రెడ్డి మాత్రం వైసీపీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేస్తామని అంటున్నారు. సీఎం జగన్ పేదల వైపు ఉంటే ఈ స్థలంలో డిగ్రీ కాలేజీ నిర్మాణం చేపట్టాలి."- స్థానిక ప్రజలు