ETV Bharat / state

వీధి లైట్ల బిల్లులకు డబ్బుల్లేవ్! 100 కోట్లకుపైగా బకాయిలతో చీకట్లో పలు నగరపంచాయితీలు - వైసీపీ వార్తలు

YSRCP government is neglecting the maintenance of LED street lights: ఎల్ఈడీ దీపాలతో కాంతులీనుతున్న నగరవీధులు. ఎక్కడ లైట్‌ వెలగకున్నా, తగినంత వెలుతురు రాకపోయినా క్షణాల్లో స్పందించే ప్రత్యేక వ్యవస్థ. ఏ ఒక్క దీపం వెలగకపోయినా నిర్వహణ చూసే సంస్థే బాధ్యత వహించేలా ఒప్పందం. ఇదంతా గతం.! ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? చిమ్మ చీకట్లలో మగ్గుతున్న నగర వీధులు. లైట్లు పాడైతే బాగుచేసే దిక్కులేని వ్యవస్థపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

YSRCP government
YSRCP government
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 10:31 AM IST

YSRCP government is neglecting the maintenance of LED street lights: ప్రభుత్వం అంటే ప్రగతికి ప్రతీకగా ఉండాలి. గత ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి చేస్తే దానికి మరింత మెరుగులు అద్ది పరుగులు పెట్టించాలి. కానీ, అంతకు ముందు సర్కార్‌ ప్రజలకు మంచిచేసినా పైశాచికత్వంతో నిలిపివేస్తే, ఆ పాలనను ఏమంటారు? ఇంకేమంటారు? జగనన్నపాలన అంటారు. పోనీ అంతకంటే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారా? అంటే అదీ లేదు. వైస్సార్సీపీ రివర్స్‌ పాలనకు మరో ప్రత్యక్ష నిదర్శనమే, నగరాల్లో అలుముకున్న చీకట్లు. ఒకప్పుడు అత్యంత అస్తవ్యస్తంగా ఉన్న వీధి దీపాల నిర్వహణను గత ప్రభుత్వం గాడిలో పెడితే, జగన్‌ ప్రభుత్వం వచ్చాక పరిస్థితిని మళ్లీ మొదటికే తెచ్చిన అంశంపై ప్రత్యేక కథనం.

100 కోట్లకుపైగా బకాయిలు ఇదీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేటి పాలనా వైఫల్యానికి నిదర్శనం. నగరాల్లో ఒకప్పుడు అత్యంత అస్తవ్యస్తంగా ఉన్న వీధి దీపాల నిర్వహణను గత ప్రభుత్వం గాడిలో పెట్టింది. అన్ని చోట్లా ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేసి నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్​కు (EESL)అప్పగించింది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి నగరపాలక సంస్థలపై విద్యుత్తు ఛార్జీల భారం కూడా తగ్గించింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక నగరాల్లో వీధి దీపాల నిర్వహణ మళ్లీ మొదటికే వచ్చింది. రివర్స్‌ పాలనలో ఈఈఎస్ఎల్​కు నిర్వహణ బిల్లులు సరిగా చెల్లించడం లేదు. ఇప్పటికీ 100 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌. ఒప్పంద గడువు ముగిసిన నగరపాలక సంస్థల్లో నిర్వహణ బాధ్యతల నుంచి ఈఈఎస్ఎల్ వైదొలిగింది. దీంతో మళ్లీ పాత విధానంలోనే నగరపాలక సంస్థలు వీధి దీపాల నిర్వహణను చూస్తున్నాయి. ఫలితంగా వెలగని లైట్లతో నగరాల్లోచీకట్లు అలుముకున్నాయి.

వీధి దీపాల సమస్యలపై ఫిర్యాదుకు మెుబైల్ యాప్: మంత్రి పెద్దిరెడ్డి

విశాఖ జిల్లా మహా నగర పరిధిలోని లక్షా 20వేలకు పైగా ఉన్న వీధి దీపాల్లో 30శాతం వరకు వెలగడం లేదు. శివారు ప్రాంతాల్లో ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీకావు. గత నెలలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వీధి దీపాల నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉందని కార్పొరేటర్లు గగ్గోలు పెట్టారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆరు నెలల క్రితం వీధి లైట్ల నిర్వహణను ఒక ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. ప్రత్యేకించి మధురవాడ, కొమ్మాది, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, భీమునిపట్నంలోసమస్య తీవ్రంగా ఉంది.

గుంటూరు జిల్లా నగరపాలక సంస్థ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాల్లోలోని వీధులూ నిశీధిలోనే మగ్గుతున్నాయి. నగర వ్యాప్తంగా ఉన్న దాదాపు 25 వేల వీధీ దీపాల్లో రోజూ 20శాతం వరకు వెలగడం లేదు. లాల్‌పురం రోడ్డు, ఏటుకూరు రోడ్డు, పలకలూరు రోడ్డు, కల్యాణీనగర్‌ తదితర ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు పరిధిలోని గాయత్రీనగర్, అన్నపూర్ణనగర్‌ తదితర ప్రాంతాల్లోనూ లైట్లు సరిగా వెలగడం లేదు. తెనాలిలో వీధి దీపాలు నిర్వహణ సరిగా లేక అనేక వీధుల్లో అంధకారం నెలకుంటోంది.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారుల్లో తప్పితే కాలనీల్లో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. పాడైన లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటులోనూ తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఈఈఎస్‌ఎఎల్‌ ఒప్పందం ముగిశాక నిర్వహణను నగరపాలక సంస్థే చూస్తోంది. సిబ్బంది కొరతతో చిన్న చిన్న సాంకేతిక సమస్యలూ పరిష్కరించడం లేదు. నగర వ్యాప్తంగా 36 వేలకుపైగా లైట్లు ఉంటే... రోజూ 12 నుంచి 15% వరకు వెలగడం లేదు. ఎంతో కీలకమైన ఎంజీ రోడ్డులో పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి రాఘవయ్యపార్కు మధ్య అక్కడక్కడ లైట్లు మసకేశాయి. సింగ్‌నగర్‌ నుంచి రామవరప్పాడు రోడ్డులో, సొరంగ మార్గం నుంచి గొల్లపూడి బైపాస్‌రోడ్డు, జాతీయ రహదారి-పప్పుల మార్కెట్, మహానాడు రోడ్డులో అక్కడక్కడ వీధి దీపాలు వెలగడం లేదు.

నెల్లూరు జిల్లా నగరంలో వీధి దీపాల నిర్వహణ అత్యంత అధ్వానంగా మారింది. లైట్లు వెలగక అత్యధిక ప్రాంతాల్లో అంధకారం అలుముకుంటోంది. శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయం. ప్రత్యేకించి కొత్తూరు, చంద్రబాబునగర్, భగత్‌సింగ్‌కాలనీ, వైఎస్‌ఆర్‌ నగర్, శ్రామికనగర్‌ తదితర ప్రాంతాల్లో రాత్రుల్లో లైట్లు వెలగడం గగనమవుతోంది. నగర వ్యాప్తంగా ఉన్న 40 వేల వీధి దీపాల్లో 10 వేల వరకు వెలగడం లేదు.

Street Lights: గాడి తప్పుతున్న వీధి దీపాల నిర్వహణ..ప్రజలకు తప్పని అవస్థలు

కాకినాడ జిల్లా నగరపాలక సంస్థ పరిధిలోనూ 14 వేల వీధి దీపాల్లో సగం కూడా వెలగడం లేదు. గతంలో 90 నుంచి 100శాతం లైట్లు వెలిగేవి. నిర్వహణ బాధ్యతల ఈఈఎస్‌ఎల్‌ వైదొలిగాక సిబ్బంది, విద్యుత్తు పరికరాల కొరతతో లైట్లు పాడైనా వెంటనే పునరుద్ధరించడం లేదు. కీలక ప్రాంతాలైన జేఎన్​టీయూ నుంచి సర్పవరం కూడలి, గాంధీనగర్, రామారావుపేట, వెంకట్‌నగర్, గొడారిగుంట తదితర ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది.

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వెలగని వీధి లైట్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆరు నెలల వ్యవధిలో అంధకారంతో ఇద్దరు పాముకాటుకు గురయ్యారు. వీధి దీపాలు వేయించుకోలేని కౌన్సిలర్‌ పదవి అవసరమా? అని అధికార వైస్సార్సీపీ కౌన్సిలర్‌ ఆర్‌.మాధవరరావు గత నెల 30న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 29 వార్డుల్లో 320కిపైగా వీధి దీపాలు వెలగనట్లుగా అధికారుల పరిశీలనలోనే వెల్లడైంది. పాడైన లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, ఇతర స్పేర్‌ పార్టుల కోసం 5 లక్షలు కేటాయిస్తూ పాలకవర్గం తీర్మానం చేసి రెండు నెలలైనా పనులైతే ప్రారంభం కాలేదు. పట్టణ శివారులో కొత్త కాలనీల్లో వీధి దీపాల ఏర్పాటుకు వేసిన స్తంభాలు అలంకార ప్రాయంగా మిగిలాయి.

మరింత అధ్వానంగా వీధి దీపాల నిర్వహణ రాష్ట్రంలోని 29 నగర పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ మరింత అధ్వానంగా మారింది. లైట్లలో సగం కూడా రాత్రుల్లో వెలగడం లేదు. వీటి నిర్వహణను మొదటి నుంచి నగర పంచాయతీలే చూస్తున్నాయి. నిధులు, సిబ్బంది కొరతతో పాడైన లైట్లను సకాలంలో పునరుద్ధరించడం లేదు. పాలకొండ, నెల్లిమర్ల, ఉయ్యూరు, తిరువూరు, గురజాల, అద్దంకి, గిద్దలూరు, పెనుకొండ, మడకశిర, కమలాపురం తదితర నగర పంచాయతీల్లో సమస్య తీవ్రంగా ఉంది.

LED street lights: బకాయిలు చెల్లించని ప్రభుత్వం.. అటకెక్కిన ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్ట్‌

వైఎస్సార్సీపీ చీకటి పాలన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.