YCP Govt Doesnot Care about Tourist Places: పర్యాటక రంగానికి పెద్ద పీట వేశామని.. ఏపీని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని.. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. కానీ చేతలు మాత్రం శూన్యం. విజయవాడలో పర్యాటక స్థలాలే అందుకు నిదర్శనం. గతంలో పర్యాటకులతో కళకళలాడిన భవానీ ద్వీపం, గాంధీ పర్వతం, ప్రకాశం బ్యారేజి.. ప్రస్తుతం సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుంది విజయవాడలో పర్యాటకరంగ పరిస్థితి. కృష్ణా నది మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన భవానీ ద్వీపం చాలా ప్రసిద్ధి. నిత్య కల్యాణం పచ్చ తోరణం లాగా పర్యాటకులతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. పర్యాటకులతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఐలాండ్ ప్రస్తుతం పాలకులు పట్టించుకోక అనాధరణకు గురవుతోంది. ఆదాయం తెచ్చే భవానీ ఐలాండ్‌ను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది.
కృష్ణానది అందాలను తిలకిస్తూ భవానీ ఐలాండ్ చేరుకోవడం అంటే పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు. సాధారణ రోజుల్లో రోజుకు రెండు నుంచి మూడు వేల మంది భవానీ ఐలాండ్ సందర్శిస్తుంటారు. ఆదే వారంతపు రోజులైన శని, ఆది వారాల్లో అయితే 5 వేల మంది మంది వరకు ఈ ఐలాండ్‌న్ని సందర్శిస్తారు. బయట నుంచి విజయవాడ వచ్చిన వారు.. అక్కడకు వెళ్లకుండా ఉండలేరు. కాలంతో సంబంధం లేకుండా నిత్యం రద్దీగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో.. వాటర్ గేమ్స్, రోబోటిక్ జురాసిక్ పార్క్, అరుదైన పక్షుల కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ వైసీపీ పాలనలో నాలుగున్నరేళ్లుగా నిర్వహణ లేక అధ్వానంగా మారింది. భవానీ ద్వీపం అభివృద్ధి కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లేదు.
విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న పర్వతానికి 1921 ఏప్రిల్ నెలలో గాంధీజీ కోటి రూపాయల స్వరాజ్య నిధి సేకరించారు. జాతీయ ఉద్యమ స్ఫూర్తితో మహాత్మ గాంధీ తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా దీనికి గాంధీ పర్వతంగా పేరు పెట్టారు. గాంధీ స్మారక గ్రంధాలయము, నక్షత్రశాలను రూపకల్పన చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలతో దృశ్య శ్రవణ ప్రదర్శన వేదికలను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఇవేవి కనిపించవు. కనీస వసతుల్లేక సందర్శకుల తాకిడి తగ్గింది.
Wild Elephant Attack : పర్యటకులను బెంబేలెత్తించిన ఏనుగు.. అడవి మధ్యలో దారి కాచి..
విజయవాడకే తలమానికంగా ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తుంటారు. విద్యుత్ కాంతుల మధ్య మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ చిన్నాపెద్దా సందడి చేస్తారు. కానీ ప్రస్తుతం నాటి వెలుగులు కనిపించడం లేదు. అదే విధంగా మెగల్రాజ్పురం గుహలు గతంలో పర్యాటకులతో కిటికిటలాడేవి. కానీ ఇప్పుడు చెత్తాచెదారం, శిథిలావస్థలో ఉన్న విగ్రహాలు, తుప్పు పట్టిన ఆట సామగ్రి దర్శనమిస్తున్నాయి.
Vijayawada Bhavani Island: నాడు కళకళ.. నేడు వెలవెల..! భవానీ ద్వీపం దుస్థితిపై పర్యాటకుల ఆవేదన