Yanamala Rama Krishnudu: ఫ్యాక్షనిస్టు నోట.. సోషలిస్టు మాట సిగ్గుచేటని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. మూడున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో బీసీలకు ఇక్కట్లు తప్ప మరేం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగదొక్కుతున్న జగన్ రెడ్డిని కీర్తిస్తున్న బీసీ మంత్రులు సిగ్గుపడాలని అన్నారు. వేయికి పైగా నామినేటెడ్ పదవుల్లో బీసీల స్థానం ఎక్కడ అని ప్రశ్నించారు. యూనివర్శిటీ వీసీలుగా ఉన్న బీసీలను బెదిరించి రాజీనామాలు చేయించడం నిజం కాదా అంటూ మండిపడ్డారు. బీసీలకు బ్రిటీష్ పాలనలో కూడా జగన్ రెడ్డి పాలనలో జరిగినంత ద్రోహం జరగలేదన్నారు.
బీసీలకు ఆర్ధిక, రాజకీయ, సామాజిక గుర్తింపు తెదేపాతోనే సాధ్యమని.. అందుకే బీసీలను తెదేపా నుంచి దూరం చేసేందుకు జగన్ రెడ్డి నక్క జిత్తులు వేస్తున్నారని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు, కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించి నిధులివ్వకపోవడం దగా.. ద్రోహంకాదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ జనగణనపై తెదేపా చేసిన తీర్మానంపై కేంద్రంపై జగన్ రెడ్డి ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. జగన్ రెడ్డిని మించిన ఫాక్షనిస్టు ఎవరు ఉండరేమో అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: