ETV Bharat / state

Sankranti Festival : పిల్లలకు సంక్రాంతి పాఠాలు నేర్పిద్దామా - tell specialness Sankranti festival for children

Sankranti Festival: ఒకప్పుడు సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు.. రకరకాల పిండి వంటలు.. ఆకర్షించే గాలిపటాలతో ప్రత్యేక శోభ సంతరించుకునేది. కానీ ఈరోజుల్లో ఆ పాత కాల పద్ధతులను.. నేటి తరం పాటిస్తున్నారా?. ఏదైనా ఫోన్​లోనే అంటూ.. వివిధ యాప్​లతో నిమిషాల్లోనే కావాల్సినవి ఇంటికి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే సంక్రాంతి పండగ పాఠం వారికి కాస్త నేర్పిద్దామా.

Sankranti Festival
సంక్రాంతి పండగ
author img

By

Published : Jan 14, 2023, 6:30 AM IST

Updated : Jan 14, 2023, 8:49 AM IST

Sankranti Festival: మన చిన్నతనంలో సంక్రాంతి ఎలా ఉండేది? ఇంటి ముందు పెద్ద రంగవల్లికలు.. పక్కవాళ్లతో పోల్చుకొని ఎవరిది బాగుందో చూడటం. బంధువులు ఇంటికి రావడం.. లేదూ మనమే వెళ్లడం. అమ్మకి పిండి వంటల్లో సాయం చేయడం.. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల చిన్ననాటి కబుర్లు చెబుతోంటే ఆసక్తిగా వినడం. ఆ ఆనందంలో అంతర్భాగంగా రైతు కష్టం, ఇతరులకి సాయం చేయడం, కలిసి పనిచేయడం వంటివెన్నో నేర్చుకున్నాం. మరి ఈ తరం సంగతేంటి? యాప్‌తో నిమిషాల్లో కావాల్సినవి కళ్ల ముందుకొచ్చే వాళ్లకి వీటి విలువ తెలియజేయాలిగా మరి!

వాళ్లకి మన మూలాలు తెలుస్తాయి: వంటగదిలో అమ్మ కష్టపడితేనే పళ్లెంలోకి తిండి వస్తుందని పిల్లలకు చెబితే సరిపోదు. అది మన వంటగది వరకూ రావడానికి ఎందరు కష్ట పడుతున్నారో కూడా చెప్పాలి. పండక్కి పల్లెటూరికి వెళితే సరే! ఆ అవకాశం లేకపోయినా దగ్గర్లోని పొలానికి తీసుకెళ్లండి. ఎంతమంది ఎలా కష్టపడితే.. ఆహారం అందరికీ చేరుతోందో చెప్పండి. వాళ్లకి మన మూలాలు తెలుస్తాయి. సహానుభూతి చూపడం, కష్టపడే తత్వం.. ఆహారాన్ని వృథా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం వంటివి అలవడతాయి.

కష్టాన్ని గౌరవించడం నేర్చుకుంటారు: దుక్కి దున్నడం నుంచి పంటను ఇంటికి చేర్చడం వరకు రైతే కాదు.. అతని పూర్తి కుటుంబ కష్టం దాగుంటుంది. పట్టణాల్లో పిల్లలు కొద్దిగా మారాం చేస్తే చాలు.. ఏదైనా చేతికి అందుతుందన్న ధోరణిలో పెరుగుతారు. చేతులు, కాళ్లకు దుమ్ము అంటినా సహించలేరు. మనం అరచేతిలో పెట్టుకొని పెంచడమూ దీనికి కారణమే! అయితే ‘ఛీ బురద’ అని వాళ్లు అసహ్యించుకునే దానిలో రైతు ఎంత కష్టపడితే మన నోటికి ముద్ద అందుతోందో చెప్పండి. కష్టాన్ని గౌరవించడం నేర్చుకుంటారు.

మరి.. నేర్పడానికి మీరు సిద్ధమా?: పండగలంటే బంధువులంతా ఒకచోటే చేరేవారు. ఆటలు, పాటలు ఇవే కాలక్షేపాలు. మరి ఇప్పుడో? చేతిలో సెల్‌ఫోన్‌, ఎదురుగా కంప్యూటర్‌ ఉంటే చాలు. ఈ సంక్రాంతికి గ్యాడ్జెట్లకు సెలవు ఇచ్చేయండి. బంధువులతో సరదాగా గడపడం, ఇంటిల్లపాదీ కలిసి గాలిపటాలు ఎగరేయడం, పిండివంటలు చేయడం.. కథలు చెప్పుకోవడం వంటివి చేయండి. మొత్తంగా ‘పాత పద్ధతి’లో పండగను నిర్వహించుకోండి. అంతర్లీనంగా ఎన్నో పాఠాలు చెప్పినవారవుతారు. పిల్లలకీ ఈ పండగ మధురానుభూతిగా నిలుస్తుంది. మరి.. నేర్పడానికి మీరు సిద్ధమా?

ఇవీ చదవండి:

Last Updated : Jan 14, 2023, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.