ETV Bharat / state

ఈనెల 20న 'విజయవాడ రన్నర్స్' ఆధ్వర్యంలో మారథాన్​

Vijayawada Marathon: విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ఉదయం 5 గంటలకు 21, 10, 5 కిలోమీటర్ల మారథాన్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు మణిదీపక్, కృష్ణ తేజ తెలిపారు. కొవిడ్ కాలంలో వర్చువల్ పద్దతిలో నిర్వహించగా.. ఈ సారి పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

విజయవాడ మారధాన్
Vijayawada Marathon
author img

By

Published : Nov 17, 2022, 7:50 PM IST

Marathon 2022 to be held on November 20: ఈ నెల 20వ తేదీన ఉదయం 5 గంటలకు విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో 21, 10, 5 కిలోమీటర్ల విభాగాలలో మారథాన్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు మణిదీపక్, కృష్ణతేజ తెలిపారు. ఈ రన్ ఎంజీ రోడ్డులోని డి అడ్రస్ మాల్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. 5గంటలకు 21 కిలోమీటర్ల రన్, 6గంటలకు 10కిలోమీటర్ల రన్, 6.30 గంటలకు 5కిలోమీటర్ల రన్ నిర్వహిస్తామన్నారు. మారథాన్​కు సంబంధించిన టీషర్టు, మెడల్​ను నగరంలోని ఓ ప్రయివేటు హోటల్​లో ఆవిష్కరించారు.

ఇది తమ ఆధ్వర్యంలో జరగనున్న ఏడో మారథాన్ అని నిర్వహకులు తెలిపారు. కొవిడ్ సమయంలో వర్చువల్ పద్దతిలో నిర్వహించగా.. ఈసారి పూర్తి స్థాయిలో మారథాన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రన్నర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావి రమేశ్, మారథాన్ సభ్యులు రమేష్ బాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.