Vidyonnathi Scheme Stopped by CM Jagan : సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించి దేశంలోనే ఉన్నతస్థాయి ఉద్యోగాలను సాధించాలనేది ఎంతో మంది కల. దీన్ని నెరవేర్చుకోవాలంటే పేద విద్యార్థులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రఖ్యాత శిక్షణ సంస్థల్లో తర్ఫీదు పొందడమంటే బాగా ఖర్చుతో కూడుకున్న పనే. పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ అండగా నిలబడడమంటే వారికి గొప్ప అవకాశాన్ని కల్పించడమే.
ఇదే పనిని గత తెలుగుదేశం ప్రభుత్వం నిండు మనసుతో చేసింది. పేద బీసీ విద్యార్థులకు అండగా విద్యోన్నతి పథకాన్ని అమలు చేసింది. దాదాపు 6 వేల 248 మందికి లబ్ధిని అందించింది. దేశంలో ఎక్కడైనా సరే సివిల్స్‌లో పేరెన్నికగన్న కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందేందుకు ఆర్థిక సాయాన్ని అందించింది. కానీ బీసీలు ఉన్నత స్థాయికి వెళితే ఎలా అని సీఎం జగన్ అనుకున్నారో ఏమో? .అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని నిలిపేశారు.
Free Training to Poor Students for Civils in TDP Government : గతంలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం పేద బీసీ విద్యార్థులకు దేశంలోనే ప్రఖ్యాత శిక్షణ సంస్థల్లో ఉచితంగా సివిల్స్ శిక్షణ అందించింది. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు.. ఇలా విద్యార్థులు కోరుకున్న చోట వారు ఎంపిక చేసుకున్న బెస్ట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. కోచింగ్ సెంటర్ల ఫీజును బట్టి ఒక్కో విద్యార్థిపై 80 వేల నుంచి లక్షా 20 వేల వరకు వెచ్చించింది. ఈ మొత్తాన్ని నేరుగా శిక్షణా కేంద్రాల యాజమాన్యాలకే అందించింది.
Subsidies Cut to BC: బీసీల రాయితీలకు జగన్ సర్కార్ భారీగా కోత.. పారిశ్రామికవేత్తల ప్యాకేజీకి మంగళం
ఇళ్లకు దూరంగా ఉంటున్న విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని పుస్తకాలు, మెటీరియల్, ఇతర ఖర్చులకు నెలనెలా 10 వేల చొప్పున 9 నెలలపాటు భృతిని కూడా అందించింది. విద్యార్థుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించింది. ఇలా టీడీపీ ప్రభుత్వంలో ఏకంగా 6 వేల 248 మందికి లబ్ధిని అందించింది. రాష్ట్రంలోని గ్రామస్థాయి నుంచి సివిల్స్ ఉచిత శిక్షణకు (Free Training to Civils from Village Level) ఎంపికైన విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లోని అత్యున్నత శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదు పొందారు. పోటీతత్వం ఎలా ఉంటుందో అవగాహన పెంచుకున్నారు. సివిల్స్‌లో ఉద్యోగాన్ని సంపాదించ లేకపోయినా అక్కడ నేర్చుకున్న విషయాలతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారూ ఎందరో ఉన్నారు.
CM Jagan Changed Scheme Names : తెలుగుదేశం ప్రభుత్వం ఇంతమంది బీసీ విద్యార్థులకు మేలు చేస్తే జగన్‌కు కన్ను కుట్టినట్లుంది. ఆయన అధికారంలోకి రాగానే పథకానికి ఉన్న ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్సార్ పేరు పెట్టుకున్నారు. అంతటితో సంతృప్తి చెందలేదు. బీసీలు బాగుపడితే ఎలా అనుకున్నారో ఏమో ఏకంగా రద్దు చేసినట్టు చూపించకుండానే ఆ పథకాన్ని నిలిపేశారు. తెలుగుదేశం అధికారం నుంచి దిగిపోయే నాటికి 307 మంది తర్ఫీదు పొందిన విద్యార్థులకు 2కోట్ల 56 లక్షలు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఆ పథకాన్నే ఆపేసన జగన్.. కనీసం బకాయిలూ చెల్లించలేదు. చివరికి అందులో కొన్ని సంస్థలు ప్రభుత్వంపై కోర్టుకు కూడా వెళ్లాయి..
AP Medical seats for sale ఏడాదిలో 694 ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధుల సీట్లను అమ్మేస్తారా ! ఇదేనా బడుగు బలహీనవర్గాలపై ప్రేమ..
13 BC Study Circles in the State : ప్రఖ్యాత శిక్షణ సంస్థల్లో బీసీ విద్యార్థులకు అందుతున్న శిక్షణను నిలిపేసిన జగన్ అంతకన్నా గొప్ప పథకాన్ని వారి కోసం ఏమైనా తెచ్చారా అంటే అదీ లేదు. పోనీ రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలోనైనా ఉచితంగా సివిల్స్ శిక్షణ ఇప్పించారా అంటే ..ఆ ఊసే లేదు. వీటిలో సివిల్స్ సర్వీస్ శిక్షణ అన్న మాటే నాలుగేళ్లుగా వినబడలేదు. జిల్లాల విభజనకు ముందు రాష్ట్రంలో 13 బీసీ స్డడీ సర్కిళ్లు ఉన్నాయి.
Only 499 People were Trained by BC Study Circles in Four Years : జగన్ ఘనంగా జిల్లాలను విభజించినా బీసీ స్డడీ సర్కిళ్లను మాత్రం అన్ని జిల్లాలకు విస్తరించలేదు. పాత వాటినే నామమాత్రంగా కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల శిక్షణ అనే మాటే లేదు. మొత్తంగా ఈ నాలుగేళ్లలో బీసీ స్డడీ సర్కిళ్ల ద్వారా ఆయన శిక్షణ అందించింది కేవలం 499 మందికి మాత్రమే. దీన్ని బట్టి జగన్‌కు పేదల చదువంటే ఎంత చులకనో చెప్పకనే చెప్పొచ్చు.