ETV Bharat / state

Central govt Housing Funds వైసీపీ సర్కారుకు కేంద్రం షాక్​.. ఈ దెబ్బతో జగన్​ ప్రచార యావకు పులుస్టాప్!

author img

By

Published : Aug 1, 2023, 6:54 AM IST

Updated : Aug 1, 2023, 8:44 AM IST

Pradhan Mantri Awas Yojana Scheme Funds రాష్ట్రంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలపై.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇళ్ల కోసం కేటాయించిన లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమచేయాలని కేంద్రం స్పష్టం చేసింది. తాము ఇస్తున్న నిధులను ఇంటి నిర్మాణ సామగ్రి ఖర్చు పేరుతో మినహాయించరాదని కేంద్రం ప్రకటించటంతో.. సీఎం జగన్​ కొత్త ఎత్తులు వేస్తున్నారు. కేంద్రమిచ్చే డబ్బుతోనే సరిపెట్టేలా ఎత్తుగడ వేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

Union Government on Pradhan Mantri Awas Yojana Scheme Funds: గృహనిర్మాణ నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఇస్తున్న నిధులను.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. ఇంటి నిర్మాణ సామగ్రి ఖర్చు పేరిట తామిచ్చే నిధులను మినహాయించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయినా కేంద్రమిచ్చే డబ్బుతోనే సరిపెట్టేలా ఎత్తుగడ వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సామగ్రి కోరుకునే లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రాల సేకరిస్తోంది.

సిమెంటు, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రి అందించినందుకు కేంద్రం ఇచ్చే నిధుల నుంచి మినహాయించి మిగిలిన డబ్బులు లబ్ధిదారులకు ఇస్తుండటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇస్తున్న నిధులను.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది.

మొత్తం వ్యయం రాష్ట్రమే భరిస్తున్నట్లు గొప్పలు : ఒక్కో లబ్ధిదారునికి ఇంటి నిర్మాణానికి అందిస్తున్న లక్ష 50 వేల రూపాయలను.. లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసినట్టు రాష్ట్ర నోడల్‌ ఖాతాలో నమోదు కావాలని కేంద్రం పేర్కొంది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తున్నా.. మొత్తం వ్యయాన్ని తామే భరిస్తున్నట్లు సీఎం జగన్‌ గొప్పలు చెబుతున్నారు. దీన్ని కట్టడి చేసేందుకే కేంద్రం ఈ తరహా ఆదేశాలని ప్రచారంలో ఉంది.

లబ్ధిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంగీకార పత్రాలు : అయితే తిమ్మిని బమ్మిని చేయడంలో ఆరితేరిన జగన్‌కు.. ఇలాంటి ఆదేశాలో లెక్కా అనే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కేంద్రం ఇలా ఆదేశాలిచ్చిందో లేదో జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. కేంద్రమిచ్చే ఆర్థిక సాయంలోనే సామగ్రి విలువను సరిపెట్టేలా.. లబ్ధిదారుల నుంచి స్వచ్ఛంద అంగీకార పత్రాలను సేకరిస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమయ్యే కేంద్ర నిధుల నుంచి మినహాయించుకునేలా అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు. కేంద్రమిచ్చే నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమైన వెంటనే.. నిర్మాణ సామగ్రికి అయ్యే మొత్తాన్ని నేరుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయ ఖాతాలకు బదిలీ చేసేలా అంగీకార పత్రంలో రాసి ఉంది.

లబ్ధిదారుల మొర ఆలకించని రాష్ట్ర ప్రభుత్వం : రాష్ట్ర వ్యాప్తంగా 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తుండగా.. పట్టణాల్లోని లబ్ధిదారులకు కేంద్రం లక్షా 50 వేలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా 30 వేలతో సరిపెడుతోంది. మరో లక్ష ఇవ్వాలని లబ్ధిదారులు మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 90 బస్తాల సిమెంటు, అర టన్ను ఇనుము ఇస్తున్నామంటూ.. వాటి వ్యయాన్ని కేంద్రమిచ్చే నిధుల నుంచి కోత వేసి మిగతా మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది.

జగన్​ ప్రచారానికి అడ్డుకట్ట: లబ్ధిదారులకు అవసరమైతే మరో 50 బస్తాల సిమెంటు అదనంగా ఇస్తామని ఉత్తర్వులిచ్చింది. సిమెంటు, స్టీలుకు అయ్యే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఖర్చు చేసినట్లు జగన్‌ డప్పు కొడుతు‌న్నారు. మూడున్నరేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. ఇన్నాళ్ల తర్వాత మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం.. దీనికి అడ్డుకట్టవేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

సామగ్రికి సరిపోని రాష్ట్ర ప్రభుత్వ వాటా: పట్టణాభివృద్ధి సంస్థల్లో పూర్తిగా కేంద్ర సాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని నెట్టుకొస్తోంది. ఉపాధి హామీ కింద ఇచ్చే 30 వేలను నిర్మాణ సామగ్రికి వెచ్చించడానికి వీల్లేదు. కేంద్రమిచ్చే లక్షా 50 వేలు కూడా సామగ్రికి ఖర్చు పెట్టకూడదని చెబుతోంది. పట్టణాల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 30 వేలు ఇస్తున్నా.. సామగ్రికి అది ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం సిమెంటు బస్తా 260కి, టన్ను స్టీలు 63 వేలకు అందిస్తోంది. ఆ లెక్కన ఒక్కో ఇంటికి ఇచ్చే సిమెంటు, స్టీలు విలువ 50 వేలపైనే అవుతుంది. కీటికీలు, ఎలక్ట్రికల్‌ వస్తువులు, ఇతర సామగ్రి అందిస్తే అదనపు భారం తప్పదు.

మరీ కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న ఇళ్లకు ఒప్పందమెలా: ఆప్షన్‌-3 కింద 3.52 లక్షల గృహాలను గుత్తేదారులకు అప్పగించి ప్రభుత్వమే కట్టించి ఇస్తామని చెబుతోంది. లబ్ధిదారులకు, గుత్తేదారులు, బ్యాంకుకు మధ్య త్రైపాక్షిక ఒప్పందాన్ని ప్రభుత్వ అధికారులే దగ్గరుండి కుదురుస్తున్నారు. గుత్తేదారులకు అవసరమైన సమస్త సామగ్రిని రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. కేంద్రమిచ్చే నిధుల్ని ఆ సామగ్రికి ఎలా మళ్లిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం మాత్రం అది లబ్ధిదారులకు, గుత్తేదారులకు మధ్య జరిగిన ఒప్పందమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

గృహనిర్మాణ నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షాక్‌

Last Updated : Aug 1, 2023, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.