Road Accidents in NTR District: రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే.. ఆ ప్రమాదం.. వారి కుటుంబాలని తలకిందులు చేస్తుంది. ఈ రోజు జరిగిన కొన్ని ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వారి కోసం వాళ్ల తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో కదా..!
విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఏలూరుకు చెందిన రిజ్వాన్, రఫీ బైక్‌పై వెళ్తుండగా.. వీరి వాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో రిజ్వాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రఫీని.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతనూ మృతి చెందారు. నెల్లూరు జిల్లా చౌకచర్ల గ్రామానికి చెందిన కారు డ్రైవర్ గురుసాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదే విధంగా.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచర్ల వద్ద ఈరోజు తెల్లవారుజామున ఓ కారును.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గుర్తు తెలియని కంటైనర్ ఢీ కొట్టింది. దీంతో కారు పక్కనే ఉన్న సైడ్ కాలువలో పడింది. ఎంతో కష్టంమీద.. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. అహ్మద్ వలి, పమిడిముక్కల రాజేష్‌లు తమంతట తాముగా కారులో నుంచి బయటకు వచ్చారు. రోడ్డు మీద కూర్చుని ఉండగా.. అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి వారిని చూసి 108కు సమాచారం ఇచ్చారు. దీంతో 108 సిబ్బంది వారికి ప్రథమ చికిత్స చేసి అనంతరం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: