ETV Bharat / state

Sand: "గనులశాఖ డైరెక్టర్‌ గారు.. తెలంగాణలో పట్టుకున్న ఇసుక లారీల సంగతేంటండి?" - ఎన్టీఆర్‌ జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఇసుక రవాణా

Sand Illegal Transport: రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక తరలిపోతుందంటే.. అసత్య ఆరోపణలే అన్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపామంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకునేందుకు S.E.B ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఏ ఆధారాలతో ఈనాడు ఆరోపణలు చేస్తోందంటూ గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ప్రశ్నించారు..? ఇవిగో ఆధారాలు.. అర్థరాత్రులు సరిహద్దులు దాటుతున్న లారీలు.. ఇప్పుడేమంటారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 26, 2023, 7:07 AM IST

"గనులశాఖ డైరెక్టర్‌ గారు.. తెలంగాణలో పట్టుకున్న ఇసుక లారీల సంగతేంటండి?"

Sand Illegal Transport: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో దోపిడీ ఎలా సాగుతుందో వివరిస్తూ ఈటీవీ భారత్​, ఈనాడులో ప్రచురితమైన కథనంపై గనులశాఖ ఉన్నతాధికారులు కొద్ది రోజుల క్రితం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక విధానం అత్యంత పారదర్శకంగా ఉందని, ఎక్కడా అక్రమాలు లేవని, పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోవడం లేదంటూ తెలిపారు. అయితే ఎన్టీఆర్‌ జిల్లా నుంచి అక్రమంగా ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్న 15 లారీలను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు పట్టుకోవడమే కాదు.. ఆరు లారీలపై కేసులు నమోదు చేశారు. ఇక వారి కళ్లుగప్పి సరిహద్దులు దాటే లారీలు ఎన్నో లెక్కేలేదు. ఇప్పుడు వీటికి గనుల శాఖ సంచాలకుడు ఏం సమాధానం చెబుతారు..।? ఏ ఆధారాలతో వార్తలను ప్రచురితం చేస్తోందని ప్రశ్నించిన వీజీ వెంకట్‌రెడ్డికి ఈ ఆధారాలు సరిపోతాయా..? తెలంగాణ పోలీసులు పెట్టిన కేసులపై ఆయన ఏం సమాధానం చెబుతారు.

వ్యూహాత్మకంగా రవాణా: NTR జిల్లా జగ్గయ్యపేట, కంచికచర్ల, చందర్లపాడు, నందిగామ మండలాల నుంచి పెద్దఎత్తున ఇసుక అక్రమ మార్గంలో తెలంగాణ సరిహద్దులు దాటుతోంది. కృష్ణానది, మున్నేరు నుంచి లారీల్లో ఇసుకను గుట్టుచప్పుడు కాకుండా తరిలించేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం నేతలు పలుమార్లు లారీలను సరిహద్దుల్లో అడ్డుకుని ధర్నాకు దిగిన సందర్భాలు ఉన్నాయి. గని ఆత్కూరు, కాసరాబాద్‌ రేవుల్లో లభించే సన్న ఇసుకకు హైదరాబాద్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆయా మండలాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి నిత్యం సగటున 100 లారీలకు పైనే ఇసుక తరలిపోతోంది. రాత్రి 8, 9 గంటలకు మొదలయ్యే ఈ రవాణా, తెల్లవార్లూ సాగుతోంది.

చక్రం తిప్పుతున్న సలహాదారుడి కుమారుడు: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక వ్యాపారాన్ని ఇటీవల వరకు ఓ ఎమ్మెల్యే బావమరిది నిర్వహించగా.. ఇటీవలే మరో ఎమ్మెల్యే అనుయాయుడికి ఈ వ్యాపారాన్ని అప్పగించారు. అయితే సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేసే వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ సలహాదారుడి కుమారుడు చూస్తున్నట్లు తెలిసింది. ఆయా మండలాల్లోని రీచ్‌ల నుంచి బయలుదేరే లారీలను విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి మీదుగా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్ట్‌ దాటించే వరకు.. ఎవరూ అడ్డుకోకుండా ఆయనే చూస్తారని ఇసుక వ్యాపారులు చెబుతున్నారు. ఆయన ఆదేశాలతో ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో ఎక్కడ ఇసుక లారీలను అడ్డుకునేవారు ఉండరని చెబుతున్నారు.

కళ్లకు గంతలు కట్టుకున్న అధికారులు: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యదళం ఉంది. ఇంకా గనులశాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్‌ విభాగాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ తెలంగాణకు నిత్యం వందల సంఖ్యలో లారీల్లో ఇసుక అక్రమంగా తరలిపోతున్నాసరే ఒక్క శాఖ అధికారులు కూడా అడ్డుకోవడం లేదు. ఇసుక దందా వెనుక అధికార పార్టీకి చెందిన కీలక వ్యక్తులు ఉండటంతో వీరంతా కళ్లకు గంతలు కట్టేసుకున్నారు. 12, 14 టైర్ల లారీల్లో గరిష్ఠంగా 30నుంచి 35 టన్నుల వరకే ఇసుక రవాణా చేయాల్సి ఉండగా, 50 టన్నుల వరకు ఇసుక లోడ్‌ చేసుకొని తీసుకెళ్తున్నారు. దీని వల్ల రహదారులు త్వరగా దెబ్బతింటాయని తెలిసినా రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం లేదు. ఈ లారీలను అడ్డుకోకుండా చూసేందుకు అన్ని శాఖలకు కలిపి.. సగటున ఓ లారీకి కొంత మొత్తం చొప్పున చెల్లిస్తుంటారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

టీఎస్‌ఎండీసీ అధికారుల నిఘాతో: తెలంగాణలో ఇసుక విక్రయాలు అక్కడి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే లక్ష్యానికి మించి ఇసుక విక్రయాలు జరగకపోవడం వెనుక కారణం ఏమిటనే దానిపై అక్కడి అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఏపీ నుంచి పెద్దఎత్తున హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా అవుతోందని గుర్తించారు. దీనిపై నిఘా పెట్టిన అధికారులు.. మూడు రోజుల క్రితం ఒకే సమయంలో వరుసగా ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఇసుక లోడ్‌తో వెళుతున్న 15 లారీలను గుర్తించి అడ్డుకున్నారు. వీటిల్లో ఆరు లారీలపై కేసులు నమోదు చేశారు. ఏపీలో ఇసుక లారీల జోలికి వెళ్లే సాహసం అధికారులు చేయకున్నా.. తెలంగాణ అధికారులే పలు సందర్భాల్లో వీటిని అడ్డుకుని కేసులు పెడుతుండటం విశేషం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.