- కందుకూరు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
PM MODI ON KANDUKURU INCIDENT : నెల్లూరు జిల్లా కందుకూరు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- అభిమాననేతను చూడాలని.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పయిన టీడీపీ అభిమానులు..
Kandukuru Deaths History : నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు సభ తొక్కిసలాటలో మృతి చెందినవారంతా టీడీపీ కార్యకర్తలే. తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చి...తోపులాటలో ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారందరిదీ నిరుపేద కుటుంబ నేపథ్యం కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి
- ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. పెండింగ్ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి
JAGAN MET PM MODI: విభజన హామీలతోపాటు.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని వివరించారు. దీల్లిలో ప్రధానితో సమావేశమైన సీఎం జగన్.. రాత్రికి హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.
- పాఠశాల వ్యవస్థను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం.. హైకోర్టులో న్యాయవాదుల వాదనలు
HIGH COURT ON GOVT : విద్యా విధానాన్ని మెరుగుపరిచే పేరుతో పాఠశాల వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని హైకోర్టులో పిటిషనర్లు వాదనలు వినిపించారు. విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పేరుతో టీచర్ల సంఖ్యలో కోత విధించిందన్నారు. విద్యాబోధన పూర్తిగా ఆంగ్లమయం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తప్పుబట్టారు.
- దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 268 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 182 మంది కోలుకున్నారు.
- రణశక్తికి సాంకేతికత దన్ను.. చైనా సరిహద్దు వద్ద భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే!
భారత్, చైనా సరిహద్దుల్లో ఇటీవలి సైనిక ఘర్షణలతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. డ్రాగన్ విస్తరణవాదంతోనే తరచూ ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. భారత్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా చైనా అతిక్రమణలపై అప్రమత్తంగా ఉండాలి.
- క్యాసినో హోటల్లో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి..30 మందికి గాయాలు
థాయిలాండ్ సరిహద్దు కంబోడియాలోని ఓ హోటల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10మంది మృతి చెందగా.. 30మంది గాయపడ్డారు.
- పాత వాహనాలు అమ్మడం ఇక చాలా ఈజీ.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి..
పాత వాహనాల క్రయవిక్రయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను సరళతరం చేయడానికి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. డీలర్ ప్రామాణికతను గుర్తించేందుకు నమోదిత వాహనాల డీలర్లకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తీసుకొచ్చింది.
- టీ20ల్లో కొత్త కొత్తగా.. 'హార్దిక్' నయా ధోనీ అవుతాడా?
టీమ్ఇండియాలో... టీ20 ఫార్మాట్లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. అప్పట్లో 2007 టీ20 ప్రపంచకప్ ముంగిట ఏం జరిగిందో గుర్తుంది కదా.. ఇప్పుడదే జరగబోతున్నట్లు అర్థమవుతోంది. అసలు కథేంటంటే..
- వరల్డ్‌వైడ్‌గా ఆ టాప్ లిస్ట్‌లో ధనుశ్ మూవీ.. 'ఆర్ఆర్ఆర్'కు దక్కని చోటు
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ 2022 సంవత్సరానికి గానూ అత్యధిక మంది వీక్షించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను విడుదుల చేసింది. అందులో ఆర్ఆర్ఆర్కు చోటు దక్కలేదు. కానీ ధనుష్ నటించిన సినిమా ఉండటం విశేషం. ఆ వివరాలు..