ETV Bharat / state

Scam in Vijayawada: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎర.. 80 మంది నుంచి కోట్లలో వసూలు చేసిన మహిళా లీడర్ - AP Latest News

Scam in Vijayawada: రాష్ట్రం ఉన్న వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి 80మందికి పైగా నిరుద్యోగులను ఓ ముఠా మోసం చేసింది.. మార్కెట్‌లో కూరగాయలు అమ్మినంత తేలికగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తామంటూ నిరుద్యోగుల నుంచి గత రెండేళ్లలో 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఈ ముఠా దోచుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Scam in Vijayawada
ఉద్యోగం పేరుతో మహిళ మోసం.. 80 మంది నుంచి కోట్లల్లో వసూలు
author img

By

Published : May 28, 2023, 3:21 PM IST

Scam in Vijayawada: వీఆర్‌వో పోస్టు కావాలా.. 6 లక్షలు, ప్రభుత్వ పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా చేరాలంటే 7లక్షలు, విద్యుత్తు, జలమండలి విభాగాల్లో ఏఈ పోస్టులకు 15 లక్షలు, లైన్‌మన్‌గా చేరాలంటే 6 లక్షలు.. అంటూ మార్కెట్‌లో కూరగాయలు అమ్మినంత తేలికగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తామంటూ నిరుద్యోగుల నుంచి గత రెండేళ్లలో దాదాపు 10 కోట్ల రూపాయల వరకు ఓ ముఠా దోచుకుంది. విజయవాడకు చెందిన రేఖా శ్రీ అనే ఓ మహిళ ప్రధాన సూత్రధారిగా ఈ భారీ మోసానికి తెరలేపారు. నిరుద్యోగులకు నిజంగానే ఉద్యోగం వచ్చిందనేలా నమ్మించేందుకు గత రెండేళ్లుగా సచివాలయాలు, పాఠశాలలుసహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనే శిక్షణలో ఉన్న సిబ్బందిగా విధులు నిర్వహించే ఏర్పాటు చేయడం గమనార్హం. దీని కోసం ప్రభుత్వానికి చెందినట్లుగా ఓ నకిలీ వెబ్‌ సైట్ కూడా రూపొందించి దాని ద్వారా నిరుద్యోగులను పూర్తిగా నమ్మించారు. బాధిత నిరుద్యోగుల్లో కొందరు విజయవాడకు వచ్చి రేఖాశ్రీని పట్టుకుని తమ డబ్బులు ఇవ్వాలంటూ గట్టిగా ఒత్తిడి చేయడంతో తిరిగి వారి పైనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రొబేషనరీ సిబ్బందిగా శిక్షణ.. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒంగోలు, ప్రకాశం సహా పలు జిల్లాలకు చెందిన 80మందికి పైగా నిరుద్యోగులు ఈ ముఠా వలలో పడి డబ్బులు పొగొట్టుకున్నారు. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రభుత్వ విభాగంలో కొలువులు వచ్చినట్టుగా.. నియామక పత్రాలను ప్రభుత్వం నుంచి వచ్చినట్టుగానే ఇచ్చేశారు. ఐడీ కార్డులు, వెబ్‌సైట్‌లో వీరికి ఉద్యోగం వచ్చినట్టుగా వివరాలు నమోదు చేయించి, వాటిలో లాగిన్‌ అయ్యేందుకు ఐడీలు కూడా ఇచ్చారు. నకిలీ నియామకపత్రాలను ఇవ్వడమే కాకుండా.. నిరుద్యోగులకు ఎలాంటి సందేహం రాకుండా ఉండేందుకు వీరందరికీ నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే ప్రొబెషనరీ సిబ్బందిగా శిక్షణ అందించే ఏర్పాటు చేయడం గమనార్హం.

మోసం వెనుక ప్రభుత్వ సిబ్బంది పాత్రపై అనుమానాలు.. ఒంగోలుకు చెందిన ఒక మహిళకు ఇలా గత రెండేళ్లుగా రాజమండ్రి, ఉయ్యూరు, మచిలీపట్నంలోని సచివాలయాల్లోనే నేరుగా ప్రొబెషన్‌ కాలంలో ఉన్న వీఆర్‌వోగా శిక్షణకు పంపించారు. ఆమెకు నేరుగా సదరు సచివాలయాల్లో పనిచేసే పలానా వీఆర్‌వోను సంప్రదించాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులను తీసుకుని ఆమె సదరు సచివాలయాలకు వెళ్లి వీఆర్‌వోలను కలిసి చూపించగా.. వారు కూడా నెలల తరబడి శిక్షణ అందించారు. అసలు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలే రాకుండా.. సచివాలయాల్లోని సిబ్బంది శిక్షణ ఎందుకు ఇచ్చారనేది పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మోసం వెనుక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారా లేక వారికి తెలియకుండానే శిక్షణ అందించారా అనేది ప్రశ్నార్థకం.

చైన్‌ మాదిరిగా మారిన రేఖాశ్రీ మోసాలు.. విజయవాడకు చెందిన రేఖాశ్రీకి నిరుద్యోగులు డబ్బులు చెల్లించిన వెంటనే.. కేవలం వారం వ్యవధిలోనే వారికి కోరుకున్న కొలువులు వచ్చేసినట్టు నియామక పత్రాలు, ఐడీలు అన్నీ ఆమె ఇచ్చేసింది. ఆ మరుసటి నెల నుంచే వారికి నెలవారీ జీతాలు కూడా బ్యాంకు ఖాతాల్లో వేసేసేది. ఇలా.. ఒక మహిళ 2021 ఆగస్టు నెలలో వీఆర్‌వో కొలువు కోసం రూ.6 లక్షలు చెల్లించింది. ఆమెకు 2022 డిసెంబర్‌ వరకూ నెలకు 15 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జీతం పడిపోయేది. జనవరి నుంచి జీతం ఆపేసిన తర్వాతే.. అసలు విషయం బయటపడింది. అసలు తనకు ప్రభుత్వ ఉద్యోగమే రాలేదని, తనలాగే ఇంకా పదుల సంఖ్యలో ఉన్నారనే విషయం తెలిసింది. కానీ.. మోసపోయిన నిరుద్యోగులంతా రాష్ట్రంలోని చాలా జిల్లాలకు చెందిన వాళ్లు కావడంతో.. కొంతమంది అక్కడక్కడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము పలానా ఉద్యోగం కోసం డబ్బులు కట్టగానే వచ్చేసిందని నిరుద్యోగులు నమ్మిన తర్వాత.. తమలాగే ఉన్న మరికొంతమందిని కూడా తీసుకొచ్చి చేర్పించే వాళ్లు. తమకు కొలువు రావడమే కాక.. జీతం కూడా పడడంతో.. వాళ్లు పూర్తిగా నమ్మేసి.. తమ బంధువులు, స్నేహితులు, ఊరిలో ఉన్న వాళ్లను తీసుకొచ్చి చేర్చేవాళ్లు. ఇలా.. ఒక చైన్‌ మాదిరిగా ఈ మొత్తం మోసాన్ని రేఖాశ్రీ నడిపించింది.

గోప్యంగా ఉంచి విచారణ.. తాజాగా 15మంది బాధితులు కలిసి వచ్చి తమకు రావాల్సిన 78లక్షల డబ్బులు ఇవ్వాలంటూ విజయవాడలో ఉన్న రేఖాశ్రీ ఇంటి దగ్గరికి వెళ్లి ఒత్తిడి చేశారు. డబ్బులు ఇస్తేనే వెళ్తామని పట్టుబట్టడంతో వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు గురువారం రాత్రి రేఖాశ్రీతోపాటు బాధిత నిరుద్యోగులను కూడా పోలీసులు తీసుకెళ్లినట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి వరకూ తమను కూడా అక్కడే ఉంచి, ఆ తర్వాత విడిచిపెట్టారని బాధిత నిరుద్యోగులు వెల్లడించారు. ఈ విషయంపై పోలీసులు మాత్రం ఎలాంటి వివరాలను బయటకు వెల్లడించడం లేదు. గోప్యంగా ఉంచి విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.