ETV Bharat / state

వైకాపాలో డబ్బుల పంచాయితీ.. వెల్వడంలో ఉద్రిక్తత! - ఎన్టీఆర్​ జిల్లా తాజా వార్తలు

Tension: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడంలో ఉద్రిక్తత నెలకొంది. వెల్వడం గ్రామంలో వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామ సొసైటీ ఛైర్మన్ తోట తిరుపతిరావుపై ట్రాక్టర్‌తో ఎంపీటీసీ సభ్యుడు రత్నబాబు దాడికి యత్నించాడు. చెరువు మట్టి తరలింపు విషయంలో విభేదాలు తలెత్తడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ పంచాయతీ.. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వద్దకు చేరింది.

Tension
వెల్వడంలో ఉద్రిక్తత
author img

By

Published : Apr 22, 2022, 3:54 PM IST

Tension: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడంలో వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామ సొసైటీ చైర్మన్ తోట తిరుపతిరావుపై ఎంపీటీసీ సభ్యుడు ప్రత్తిపాటి రత్నబాబు ట్రాక్టర్​తో దాడికి యత్నించాడు. చెరువు మట్టి తరలింపు విషయంలో వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. గ్రామావసరాలకు మట్టి తరలించే విషయంలో వైకాపా నేతలు అనుమతులు తెచ్చుకున్నారు. మట్టి తరలింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి కేటాయించాలని నిర్ణయించారు. అయితే.. నిధుల కేటాయింపు విషయంలో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో.. మట్టి తోలకాలను ఒక వర్గం అడ్డుకోవడంతో వివాదం ముదిరింది. ఈ పంచాయితీ.. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వద్దకు చేరింది. వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అందుబాటులో లేకపోవటంతో వైకాపా కార్యాలయం వద్ద ఘర్షణ ఏర్పడింది. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఇదీ చదవండి: విజయవాడ ప్రభుత్వాస్పత్రి దగ్గర ప్రజాసంఘాల ఆందోళన.. ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.