ETV Bharat / state

Farmers Union Leaders Protest In NTR District : ఆధునీకరణకు నోచని శనగపాడు సప్లై ఛానల్.. నీరందక ఎండిపోతున్న పొలాలు.. రైతుల ఆందోళన - నందిగామ తాజా వార్తలు

Tenant Farmers Union Leaders Protest For Irrigation Water In NTR Distric : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అన్నాసాగర్ వద్ద సాగునీరు లేక వరి పైర్లు ఎండిపోతున్నాయని, శనగపాడు సప్లై ఛానల్ నుంచి నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనగపాడు సప్లై ఛానల్ ఆధునీకరించి భూములకు పంటలకు సాగునీటి కొరత లేకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

farmers  demond for irrigation water
farmers union leaders protest in ntr district
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 1:28 PM IST

Farmers Union Leaders Protest In NTR District ఆధునీకరణకు నోచుకోని శనగపాడు సప్లై ఛానల్ ఎండిపోతున్న వరి పైర్లు

Tenant Farmers Union Leaders Protest For Irrigation Water In NTR District : అన్నాసాగర్ , శనగపాడు, నందిగామ గ్రామాల పరిధిలో నీరు లేక ఎండిపోతున్న మాగాణి, పత్తి, మిర్చి పంట పొలాలను పరిశీలించిన రైతు సంఘం నాయకులు బాధిత రైతులతో కలిసి నిరసన తెలియజేశారు. గత నెల రోజులుగా శనగపాడు సప్లై ఛానల్ ద్వారా పంటపొలాలకు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.

అర్హత కలిగిన కౌలు రైతులకు అందని పెట్టుబడి సాయం...

Farmers Union Leaders Protest In NTR District : ఏడాది రైతులు అప్పులు చేసి ఎకరానికి 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి సాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి చేలు నీళ్లు లేక నెర్రెలు గొట్టి ఎండిపోతున్నాయని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందంటున్నారు. శనగపాడు సప్లై ఛానల్ పరిధిలో ఎగువ నున్న 80 అక్రమ మోటార్ల ద్వారా కొంతమంది నీరు పెట్టుకోవడం వల్ల చివర భూములకు సాగునీరు రావడంలేదని, అధికారులు అక్రమ మోటార్ కనెక్షన్లు తాత్కాలికంగా వారం రోజులు తొలగించి చివర భూముల వరకు సాగునీరు అందేలాగా కృషి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులు రాజకీయాలకు అతీతంగా తమ పంట పొలాలకు సాగునీరు అందేలాగా పోరాడాలని పేర్కొన్నారు.

'మున్నేరు శనగపాడు సప్లై ఛానల్ పరిధిలో సుమారుగా 2000 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండగా.. రైతులు 1200 ఎకరాల్లో ఈ ఏడాది పత్తి, మిర్చి, మాగాణి పంటలు సాగు చేసుకుంటున్నారు. గత నెల రోజుల క్రితం మున్నేరుకు వచ్చిన వరద ఉద్ధృతి వల్ల శనగపాడు సప్లై ఛానల్ కాలువకు పూర్తిగా గండి పడింది. దీంతో నందిగామ అన్నాసాగరం గ్రామాల పరిధిలో సుమారు 600 ఎకరాలకు పైగా చివర భూములకు నీరు అందటం లేదు. అదే విధంగా వత్సవాయి మండలం పోలంపల్లి మున్నేరు డ్యామ్ వరదలకు డ్యామేజ్ కావడంతో కట్టలు తెగి దిగువకు నీరు రావడంలేదు. దీని వల్ల మున్నేరు ఆయకట్టు పరిధిలో 16 వేల ఎకరాలకు సైతం సాగునీరు అందక, పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.' - జిల్లా కౌలు రైతుసంఘం చనుమోలు కృష్ణ

'శనగపాడు సప్లై ఛానల్ అన్నాసాగర్, నందిగామ గ్రామాలలోని మాగాణి భూములకు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. . పొలాలకు తక్షణమే శనగపాడు సప్లై ఛానల్ ద్వారా నీరు విడుదల చేయాలి. ప్రతీ సంవత్సరం వరదల తరువాత ఆయకట్ట ఆధునీకరణ జరగాల్సి ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇప్పటికై ప్రభుత్వం స్పందించి అన్నదాతలను ఆధుకోవాలి.' - జిల్లా కౌలు రైతుసంఘం కార్యదర్శి చనుమోలు సైదులు

Farmers Demond For Irrigation Water : నందిగామ నియోజకవర్గంలో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేయించి ఎన్ఎస్పీ కాలువల ద్వారా నందిగామ, చందర్లపాడు మండలాల పరిధిలోని భూములకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనగపాడు సప్లై ఛానల్ శాశ్వత ప్రాతిపదికన ఆధునీకరించాలని కౌలు రైతు సంఘం నేతలు కోరారు. శనగపాడు సప్లై ఛానల్ ఆధునీకరించి తక్షణమే అనాసాగరం, నందిగామ చివరి భూములకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనగపాడు సప్లై ఛానల్ వద్ద బుధవారం జరుగుతున్న పనులను రైతు సంఘం నాయకులు పరిశీలించారు.

అప్పుల బాధలు తాళలేక.. కౌలు రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

Problems Of Shanagapadu Supply Channel : శనగపాడు సప్లై ఛానల్ వద్ద పేరుకుపోయిన ఇసుక మేట తొలగింపు పనులను పరిశీలించారు. పనులు దగ్గరుండి చేయిస్తున్న నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ మస్తాన్ నందిగామ సొసైటీ అధ్యక్షులు పాములపాటి రమేష్ తో రైతు సంఘం నాయకులు మాట్లాడారు. పనులు త్వరతగతిన పూర్తిచేసి చివరి భూముల వరకు సాగునీరు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నందిగామ పట్టణ కార్యదర్శి కట్టారపు గోపాల్, రైతు సంఘాల నాయకులు కర్రీ వెంకటేశ్వరరావు, వాసు, చలమల కొండ, కృష్ణ, పలువురు రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.