ETV Bharat / state

Yanamala on YCP: 'టీడీపీ మినీ మేనిఫెస్టో.. జగన్ దుష్టపాలన అంతానికి తొలిమెట్టు': యనమల - ycp news

Yanamala Ramakrishnudu fire on cm jagan: 'టీడీపీ మినీ మేనిఫెస్టో.. జగన్ దుష్టపాలన అంతానికి తొలిమెట్టు' అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. త్వరలోనే మహాశక్తి పథకం మహిళాశక్తి, మహాశక్తిగా మారబోతోందన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత..రాష్ట్రమంతా అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని..గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

Yanamala
Yanamala
author img

By

Published : May 31, 2023, 5:08 PM IST

Updated : May 31, 2023, 7:00 PM IST

TDP Yanamala Ramakrishnudu fire on cm jagan: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకల్లో పార్టీ అధిష్ఠానం..'భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో తొలి అంచె మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ మేనిఫెస్టోపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఘాటుగా స్పందించారు. మినీ మేనిఫెస్టోతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్టపాలనకు ముగింపు పలకబోతోందని ధ్వజమెత్తారు.

టీడీపీ మినీ మేనిఫెస్టోపై యనమల ప్రకటన.. 'టీడీపీ మినీ మేనిఫెస్టో.. జగన్ దుష్టపాలన అంతానికి తొలిమెట్టు' అనే శీర్షికతో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు నేడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో మినీ మేనిఫెస్టోపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న ప్రచారాలపై స్పష్టతనిచ్చారు..''సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం టీడీపీ అజెండా. దోపిడీ కోసం అప్పులు చేయడం జగన్ అజెండా. మహానాడు వేదికగా తెలుగుదేశం భవిష్యత్​కు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన మినీ మేనిఫెస్టో జగన్ రెడ్డి దుష్టపాలనకు ముగింపు పలకబోతోంది. సంక్షేమం ప్రారంభమైందే నందమూరి తారకరామారావు, తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మరింత పెంచి అభివృద్ధిని జత చేశారు. సంక్షేమం అభివృద్ధి, సామాజిక న్యాయంతో తెలుగుదేశం ముందుకు వెళ్తుంటే.. లూటీ కోసం అప్పులు చేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే అజెండాగా జగన్ రెడ్డి నాలుగేళ్లు పాలన సాగింది'' అని రాసుకొచ్చారు.

'టీడీపీ మినీ మేనిఫెస్టో.. జగన్ దుష్టపాలన అంతానికి తొలిమెట్టు'

TDP Manifesto: 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. వివరాలివే..

రైతు, యువత, మహిళలకు అండంగా ఉంటాం.. అనంతరం మహాశక్తి పథకంతో మహిళాశక్తి మహాశక్తిగా మారబోతోందని.. గతంలో డ్వాక్రాను ప్రారంభించి మహిళాభివృద్ధి చేసి చూపింది చంద్రన్నే అని యనమల వివరించారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15వేలు అందిస్తామన్నారు. మహిళలకు నెలకు రూ.1500 ఆర్ధిక ప్రోత్సాహం అందించి గౌరవిస్తామన్నారు. గతంలో దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత చంద్రన్నదేనని.. ఇప్పుడు ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి జగన్ రెడ్డి పెంచిన గ్యాస్ ధరల నుండి విముక్తి కలిగిస్తామన్నారు. యువగళంతో నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల చొప్పున భృతి అందించి.. 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తమన్నారు. అన్నదాతలకు ఏటా రూ. 20వేల చొప్పున అందించి.. రైతులకు అండగా నిలుస్తామన్నామని ఆయన తేల్పిచెప్పారు.

TDP Manifesto 2024: 'టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల్లో వణుకుమొదలైంది'

వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు.. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్నందునే భోగాపురం విమానాశ్రయానికి, బందర్‌ పోర్టుకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని..టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత.. రాష్ట్రమంతా అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని ఆక్షేపించారు. ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారులు.. అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్ల కాలంలో అన్ని వ్యవస్థలనూ సమూలంగా ధ్వంసం చేశారని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

'టీడీపీ మేనిఫెస్టోతో.. తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి'

Last Updated : May 31, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.