ETV Bharat / state

60ఫీట్ల రోడ్డును 40ఫీట్లుగా చూపిస్తూ - 'ఉడా'లో రూ.15 కోట్లకు పైగా టీడీఆర్​ బాండ్ల కుంభకోణం! - Irregularities of YCP leaders in Vijayawada

TDR Bond Scam in Vijayawada Municipal Corporation: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పాత రహదారినే విస్తరిస్తున్నట్టుగా చూపించి రూ.15 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లను కొట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 2008లోనే వేసిన లే అవుట్‌లో 60 అడుగుల రహదారి ఉన్నట్టు చూపించి నగరాభివృద్ధి సంస్థ నుంచి అనుమతి తీసుకుని ఆ తర్వాత చాలా బహుళ అంతస్థుల భవనాలను నిర్మించారు. వాటికి అనుమతి తీసుకున్న ప్రతిసారీ 60 అడుగుల నగరపాలక సంస్థ రహదారి ఉన్నట్టు చూపించారు.

tdr_bond_scam
tdr_bond_scam
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 4:57 PM IST

Updated : Nov 5, 2023, 5:11 PM IST

TDR Bond Scam in Vijayawada Municipal Corporation: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లను కొట్టేసిన సంఘటన వెలుగులోనికి వచ్చింది. నగరంలోని కరెన్సీనగర్‌ మూడో డివిజన్‌లోని శ్రీబాయన బాబూజీ రోడ్డులో 359/3 సర్వే నంబరులో కిలారు మహాలక్ష్మి పేరుతో ఉన్న 1.84 ఎకరాల స్థలాన్ని లేఅవుట్‌గా వేస్తున్నామంటూ 2008లో ఉడాకు దరఖాస్తు చేసుకున్నారు. 60అడుగుల రహదారిని కూడా విడిచి పెడుతున్నట్టుగా చూపించడంతో ఉడా నుంచి లేఅవుట్‌కు అనుమతి వచ్చింది. ఆ లేఅవుట్‌లో బహుళ అంతస్థుల భవన నిర్మాణాల కోసం నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకోగా.. 60 అడుగుల రహదారి ఉన్నట్టు స్పష్టంగా చూపించడంతో అనుమతులు ఇచ్చారు. కానీ.. 2019లో దానినే 40 అడుగుల రహదారిగా చూపించి.. మళ్లీ 60 అడుగులకు విస్తరిస్తున్నట్టు పత్రాలు సృష్టించి.. ప్రభుత్వ ధనాన్ని కాజేశారు.

60ఫీట్ల రోడ్డును 40ఫీట్లుగా చూపిస్తూ - 'ఉడా'లో రూ.15 కోట్లకు పైగా టీడీఆర్​ బాండ్ల కుంభకోణం!

TDR bonds: టీడీఆర్‌ బాండ్లలో భారీ అక్రమాలు.. కోట్లు దోచుకుంటున్న అధికార పార్టీ నాయకులు

లేఅవుట్‌లోని స్థలం మొత్తాన్ని 2008కి ముందే ప్లాట్లుగా చేసి అమ్ముకోవడంతో పాత యజమానికి వాటిపై ఎలాంటి హక్కులు లేవు. అలాంటిది మళ్లీ పాత యజమాని పేరుతోనే ఈ స్థలం ఉన్నట్టు చూపించి నగరపాలక సంస్థలో చక్రం తిప్పి 15 కోట్లకు పైగా విలువైన టీడీాఆర్​ బాండ్లను తీసుకున్నారని ఈ వ్యవహారంపై వీఎంసీకి ఫిర్యాదు చేసిన సాంబశివరావు అనే వ్యక్తి చెబుతున్నారు. 2019లో నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రసన్న వెంకటేష్‌ ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగిందని ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని సాంబశివరావు చెబుతున్నారు.

YSRCP Leaders TDP Bonds Scam: అక్రమాలకు అడ్డేది.. టీడీఆర్‌ బాండ్లతో కోట్లు కొల్లగొడుతున్న వైసీపీ నేతలు

ప్రస్తుత నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ టేబుల్​పైనే నెల రోజులు ఈ దస్త్రం ఉంది. ఆ తర్వాత ఓ బృందాన్ని పంపించి మళ్లీ కొలతలు అంటూ హడావుడి చేశారు. అవినీతి జరిగినట్టు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ.. అధికారులు మాత్రం అంతా సక్రమమేనంటూ తేల్చేశారు. కిలారు మహాలక్ష్మి నుంచి 6 వేల 452 చదరపు అడుగుల స్థలం ప్రజావసరాల కోసం తీసుకున్నందుకే.. నిబంధనల మేరకు టీడీఆర్‌ బాండ్లను జారీ చేశామంటూ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఈ మొత్తం టీడీఆర్‌ బాండ్ల వ్యవహారం స్థలం పాత యజమాని కుమారుడి పర్యవేక్షణలో జరిగినట్టు తెలుస్తోంది. వీరికి నగరపాలక సంస్థకు చెందిన స్థానిక బిల్డిండ్‌ ఇన్‌స్పెక్టర్, పట్టణ ప్రణాళిక సిబ్బంది నుంచి పైస్థాయిలోని ఉన్నతాధికారుల వరకూ చాలామంది సహకరించినట్టు ఆరోపణలున్నాయి.

TDR Bonds Scam: టీడీఆర్ బాండ్ల కుంభకోణం.. ఏసీబీ విచారణపై విమర్శలు

కార్పొరేషన్‌ నుంచి బాండ్లు విడుదలైన వెంటనే వాటిని మరో 32 మందికి విక్రయించేసి డబ్బులుగా మార్చుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి పర్సంటేజీల వారీగా పంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇలాగే మరికొన్ని ప్రాంతాల్లోనూ ఉన్న పాత రహదారులనే మళ్లీ కొత్తగా విస్తరిస్తున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి ప్రజాధనాన్ని లూఠీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బాండ్లకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.

Last Updated : Nov 5, 2023, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.