TDP Photo Exhibition : మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జగన్ రెడ్డి గ్యాంగ్ లూటీ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్‌ను టీడీపీ ఏర్పాటు చేసింది. 'జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అడ్డుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో టీడీపీ ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. సహజ వనరుల లూటీ చేపట్టి 12వందల రోజులపైనే అయిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, బోండా ఉమా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే విధ్వంసం జరుగుతోందని వారు ఆరోపించారు. మాచర్లలో చల్లా మోహన్ ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్న పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పాల్పడుతున్న ఆరాచాకాలకు అధికారులు ఇకనైనా వత్తాసు పలకటం మానుకోవాలని అన్నారు. లేకపోతే భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాధితులపై కేసులు నమోదు చేసే సంస్కృతి ఎక్కడ లేదని విమర్శించారు. 43 నెలల్లో వైసీపీ ఉగ్రవాదం పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. వైసీపీ అరాచకాలు తట్టుకోలేక ఎంతో మంది బలి అవతున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: