ETV Bharat / state

సీమెన్స్ సంస్థతో జగన్ ప్రభుత్వం కుమ్మక్కైంది.. ధూళిపాళ్ల నరేంద్ర సంచలన వ్యాఖ్యలు - Tdp news

TDP SENIOUR LEADER DHULIPALLA NARENDRA FIRE ON SEIMENS ISSUE: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని అసత్య ప్రచారాలు చేస్తోందని.. తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమెన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కుమ్మక్కైందంటూ సంచలన ఆరోపణలు చేశారు. నాడు వివేకా హత్యలో నారసుర రక్తచరిత్ర అన్న వాళ్లు.. ఇప్పుడు సునీతా సురరక్త చరిత్ర అంటున్నారని ధ్వజమెత్తారు.

DHULIPALLA
DHULIPALLA
author img

By

Published : Mar 11, 2023, 7:09 PM IST

TDP SENIOUR LEADER DHULIPALLA NARENDRA FIRE ON SEIMENS ISSUE: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం పేరుతో సీఐడీ అధికారులు సెలక్టివ్‌ ఇన్విస్టిగేషన్‌ చేస్తున్నారని.. తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఒప్పందంలో భాగమైన సీమెన్స్‌ కంపెనీపై.. ఎందుకు కేసు పెట్టలేదు? అని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ముందు రాజకీయ వేధింపులను ఆపేసి, ఆ పని చేయాలని సూచించారు.

సీమెన్స్ సంస్థతో వైసీపీ ప్రభుత్వం కుమ్మక్కైంది: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. సీమెన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కుమ్మక్కైందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై సీమెన్స్ సంస్ధను వైసీపీ ప్రభుత్వం తప్పించి, ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చలేదని విమర్శలు గుప్పించారు. ఒప్పందంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించారా..? లేదా..? అని నిలదీశారు. ఆ వివరాలను ఎందుకు? బయటపెట్టం లేదని ప్రశ్నించారు.

ఈ కేసు వెనక ఏదో దురుద్దేశ్యం ఉంది..!: అనంతరం ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. డిజైన్ టెక్ సంస్థ, డిజైన్ టెక్ ఎండీ మీద కేసులు పెట్టి, సీమెన్స్ సంస్థ మీద ఎందుకు కేసు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమెన్స్ సంస్థకు చెందిన సుమన్ బోస్ అనే వ్యక్తిని మాత్రమే బాధ్యుడిగా ఎందుకు చూపుతున్నారో..? సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందే తప్ప.. సుమన్ బోస్‌తో కాదని ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు. సీమెన్స్ సంస్థను కేసులో పక్కన పెట్టడం వెనుక రాజకీయ దురుద్దేశ్యం స్పష్టంగా కన్పిస్తోందని ఆరోపించారు.

సీఎం జగన్‌కు దమ్ము, ధైర్యం ఉందా..?: సీమెన్స్ సంస్థ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ప్రజాధనం రాబట్టాలంటే సీమెన్స్ సంస్థను ముద్దాయిగా చేరిస్తే, వాస్తవాలు బయటకొస్తాయని హితవు పలికారు. సీమెన్స్ సంస్థ ఒప్పందంపై సీఎంమే రంగంలోకి దిగి దుష్ప్రచారం చేస్తోందని ధూళిపాళ్ల దుయ్యబట్టారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలను చంద్రబాబే తెచ్చారనే అభూత కల్పనలు కల్పిస్తున్నారనీ.. గుజరాత్ వంటి రాష్ట్రాలు ఏపీ కంటే ముందుగా ఒప్పందం చేసుకున్నాయని గుర్తు చేశారు.

పలు రాష్ట్రాలతో సీమెన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది: ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే సీమెన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని తెలియజేస్తూ.. ఆ ఒప్పందానికి సంబంధించిన ఆధారాలను మీడియాకు తెలిపారు. సాఫ్ట్‌వేర్ సర్టిఫికేషన్ కోసం, విలువ అంచనా కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థైనా సెంట్రల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థతో సర్టిఫికేషన్ తీసుకున్నాకే ప్రేమ్ చంద్రారెడ్డి నిధులను విడుదల చేశారని నరేంద్ర స్పష్టం చేశారు. 2017వ సంవత్సరంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమక్షంలో సీమెన్స్ సంస్థ కుదుర్చుకుందని ఆధారాలతో సహా వెల్లడించారు. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలతో సీమెన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు.

ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి, ఈనాటి మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ 2013లో సీమెన్స్ సంస్థతో చేసుకున్న ఒప్పంద ఫోటోల్లో సుమన్ బోస్‌గారు ఉన్నారు. 2017లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారి సమక్షంలో చేసుకున్వ ఒప్పంద ఆధారాలకు సంబంధించిన ఫోటోలు ఇవి. ప్రతి రాష్ట్రంలో కూడా 90శాతం ఇన్ క్యాండ్ ఆ సాఫ్ట్‌వేర్ సంస్థ సమాకుర్చుతుంది, 10శాతం ఒప్పందం చేసుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు చెల్లించటం అనేది ఈ ఒప్పందాల్లో భాగం.-ధూళిపాళ్ల నరేంద్ర, తెలుగుదేశం సీనియర్ నేత

నాడు నారసుర రక్తచరిత్ర అన్నారు-నేడు సురరక్త చరిత్ర అంటున్నారు: రాష్ట్రంలో పెద్ద తలకాయల అరెస్టు జరిగితే.. అది వివేకా హత్య కేసుకు సంబంధించిందేనంటూ ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. నాడు వివేకా హత్యలో నారసుర రక్తచరిత్ర అన్న వాళ్లు.. ఇప్పుడు సునీతా సురరక్త చరిత్ర అంటున్నారని ధ్వజమెత్తారు. వివేక హత్య కేసులో ఎంత దిగజారి వ్యవహరిస్తున్నారో? ప్రజలు గ్రహిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పెద్ద తలకాయలు అరెస్ట్ అవ్వడం కాదు.. వివేక హత్య కేసులో నాలుగు రోజుల్లో పెద్ద తలకాయలు తెగిపడబోతున్నాయని దుయ్యబట్టారు. సొంత బాబాయ్ హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. సీఎం జగన్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై అసత్యాలను తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశంపై తప్పుడు ప్రచారం చేయటం కాదు.. ముందు వాళ్ళ పెద్ద తలకాయల సంగతి ఏంటో చూసుకోవాలని నరేంద్ర హితవు పలికారు.

సీమెన్స్ సంస్థతో జగన్ ప్రభుత్వం కుమ్మక్కైంది

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.