TDP SC Cell condemned attacks on Dalits: ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ( Shyam Kumar) పై సభ్య సమాజం తలదించుకొనేలా... దాడి చేసిన నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ.. టీడీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజుతో పాటుగా... దళితులు, నేతలు తరలివచ్చి ఆందోళన చేశారు. దళిత యువకుడు పై దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు కేవలం బెయిలబుల్ సెక్షన్లపై కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రాస్తారోకో చేస్తున్న తంగిరాల సౌమ్యను కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు (MS Raju) నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావును నందిగామ పోలీస్ స్టేషన్ తరలించారు.
మంచి బట్టలు ధరించాడని దళితుడిపై దాడి.. అడ్డొచ్చిన మహిళను సైతం..
నక్కా ఆనంద్ బాబు పరామర్శ: వైసీపీ నేత హరీష్ రెడ్డి (YCP leader Harish Reddy) దాడిలో గాయపడిన ఎస్సీ యువకుడు కాండ్రు శ్యాం కుమార్ ను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆసుపత్రిలో పరామర్శించారు. దళితులపై దాడి కేసులో జగన్మోహన్ రెడ్డి ని ఏ1 గా చేర్చాలని డిమాండ్ చేశారు. జగన్ అండతోనే ఎస్సీలను వైసీపీ నేతలు యథేచ్ఛగా హింసిస్తున్నారని మండిపడ్డారు. కాండ్రు శ్యాంకుమార్ పై హరీష్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడితే, వైసీపీ నేత కాబట్టి 307పెట్టలేదని దుయ్యబట్టారు. సామాజిక బస్సు యాత్రలు అంటూ రోడ్లపై తిరుగుతున్న మంత్రులు, శ్యామ్ కుమార్ ఘటనపై ఏం సమాధానం చెబుతారని నక్కా ఆనంద్ బాబు నిలదీశారు.
పుంగనూరు నియోజకవర్గంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త.. దళితులపై దాడి
ఆగ్రహం వ్యక్తం చేసిన తెనాలి శ్రావణ్ కుమార్: దళిత జాతి వినాశనమే లక్ష్యంగా లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడిన ఈ ముఖ్యమంత్రి, అతని ప్రభుత్వం... సిగ్గులేకుండా ఏ ముఖం పెట్టుకొని నా ఎస్సీలు.. నా ఎస్టీలు అంటోందని మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ (Tenali Sravan Kumar) ప్రశ్నించారు. జగన్ రెడ్డితో నిత్యం అవమానింపబడుతూ, సిగ్గులేకుండా దళిత మంత్రులు సామాజికసాధికార బస్సుయాత్రలో ఎలా పాల్గొంటున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దళితులపై జరిగే దాడులు, హత్యలు, ఇతర అమానుష ఘటనలకు సంబంధించిన అంశాల్లో ఏ-1 జగన్ రెడ్డే అని ఆరోపించారు. అతని సామాజికవర్గం తమను జగన్ రెడ్డి రక్షిస్తాడన్న ధైర్యంతో దళితులపై దాడులు, హత్యలకు పాల్పడుతోందని శ్రావణ్ కుమార్ మండిపడ్డారు.
YSRCP Followers Attack on Dalits: కంతేరులో దళితులపై దాడి.. చర్యలకు డీజీపీకి వర్ల రామయ్య లేఖ