Kala Venkat Rao fires on YCP: తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు వైకాపా పై మండిపడ్డారు. భూ కబ్జాలు, షర్మిల వాంగ్మూలం, రైతుల పాదయాత్రతో జగన్ రెడ్డిలో ప్రస్టేషన్ పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. మూడున్నరేళ్లుగా లక్షల ఎకరాలు దోచిన జగన్రెడ్డి అండ్ కో సుద్దులు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. వేల ఎకరాలు దానం చేసిన అయ్యన్నపై రెండు సెంట్ల ఆక్రమణ అంటూ కేసు కక్ష సాధింపు కాదా అని నిలదీశారు.
అధికార గర్వంతో రాజ్యాంగేతర శక్తిగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని కళా వెంకట్రావ్ దుయ్యబట్టారు. నేతిబీరలో నెయ్యి.. బీసీ మంత్రులకు అధికారమూ రెండూ ఒకటే అని అన్నారు. విశాఖలో వారి భూ కబ్జాలను ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తారా? అంటూ మండిపడ్డారు. విశాఖలోని వేల ఎకరాలు తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ము వైకాపా నేతలు తినేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అయ్యన్న ప్రజల కోసం పోరాటం చేస్తే.. పిరికి పందలా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అర్ధరాత్రి అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్దమని తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై జగన్ రెడ్డి నియంతృత్వానికి సమాధికడతామని కళావెంకట్రావు హెచ్చరించారు.
ఇవీ చదవండి: