TDP Nakka Anand Babu Letter to CM YS Jagan: 13 అంశాలతో సీఎం జగన్‌కి టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు లేఖ రాశారు. జగన్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహం పేరుతో బొమ్మ రాజకీయాలు చేస్తూ, స్వార్థ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. అయిదేళ్ల పాలనలో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఉన్న పథకాలను నిర్వీర్యం చేయడంతోపాటు 300 మందికి పైగా దళితులను హతమార్చి, ప్రశ్నించిన వారిపై వేలాది కేసులు నమోదు చేసి, వేధింపులకు గురిచేశారని దుయ్యబట్టారు.
నిమ్నవర్గాల అభ్యున్నతికి జీవితకాలం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని, సంవత్సరాలపాటు శ్రమించి అనేక దేశాల సామాజిక, ఆర్థిక జీవన విధానాలు అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేశారని అన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం పక్కనపెట్టి దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని నష్టాన్ని అయిదేళ్లలో జగన రెడ్డి దళితులకు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీని బీసీలు, దళితులు భూస్థాపితం చేస్తారు: కాలవ శ్రీనివాసులు
దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 28 సంక్షేమ పథకాలను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రిజర్వుడు నియోజకవర్గాల మధ్యన ఏర్పాటు చేసిన ప్రజా రాజధాని నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాజధాని పూర్తయి ఉంటే అత్యధికంగా లబ్ది పొందేది, ఉపాధి పొందేది దళితులే అని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందజేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే లబ్ధిదారుల సంఖ్యను సగానికి కోత కోయడంతోపాటు దళిత వాడల్లో ఉంటేనే ఉచిత విద్యుత్ అమలవుతోందంటూ ప్రభుత్వం అవమానించిందన్నారు. దళితుల అభ్యున్నతికి గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు సైతం బలవంతంగా ప్రభుత్వం లాక్కొంటోందని ఆరోపించారు.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో వందల కోట్ల రూపాయల దోపిడీ: టీడీపీ నేతలు
గత అయిదేళ్లలో 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొని వేలాది మంది దళిత కుటుంబాలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. దళితులను బెదిరించి ఆ భూముల్లో అక్రమంగా మట్టి గ్రావెల్ తవ్వకాలను జరుపుతున్నారని విమర్శించారు. 1989 నుంచి అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేశారని ఆక్షేపించారు. దళితులపై దమనకాండ చేసిన నేరస్తులకు కొమ్ముకాశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు, విద్య, ఉపాధి ప్రమాణాలు పెంచేందుకు ఏర్పాటు చేసిన సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేశారన్నారు.
దళిత యువకులు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడే ఎస్సీ కార్పొరేషన్ కుటుంబాలను పూర్తిగా నిలిపివేశారని లేఖలో ప్రస్తావించారు. ప్రజా రాజధాని అమరావతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన అంబేడ్కర్ స్మృతివనాన్ని అర్థాంతరంగా నిలిపివేశారని ధ్వజమెత్తారు. దళితుల హక్కుల కోసం, చట్టాల కోసం, నిధుల కోసం దళితులంతా కలిసికట్టుగా పోరాడి జగన్ రెడ్డి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దళిత బాలికపై అత్యాచారం: వంగలపూడి అనిత