ETV Bharat / state

యువగళం పాదయాత్రకు అడ్డంకులు.. నేడు గవర్నర్​ను కలవనున్న టీడీపీ నేతలు - నేడు గవర్నర్‌కు ఫిర్యాదు

TDP LEADERS WILL MEET GOVERNOR TODAY: యువగళం పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు నేడు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కలవనున్నారు. పోలీసుల ఆంక్షలు, మైక్ నియంత్రణ, కేసుల నమోదు, వాహనాలు సీజ్ వంటి పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

TDP LEADER WILL MEET GOVERNOR
TDP LEADER WILL MEET GOVERNOR
author img

By

Published : Feb 11, 2023, 8:56 AM IST

TDP LEADERS WILL MEET GOVERNOR : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం.. పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్న ఆ పార్టీ నేతలు.. నేడు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమా, వర్ల రామయ్య.. ఈ ఉదయం 11గంటలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ను కలవనున్నారు. పోలీసుల ఆంక్షలు, మైక్ నియంత్రణ, కేసుల నమోదు, వాహనాలు సీజ్ వంటి పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. లోకేశ్‌ పాదయాత్రలో ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొని.. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్యంపై పెరుగుతున్న వ్యతిరేకతపైనా నివేదిక రూపొందిస్తున్నట్లు.. సమాచారం. పాదయాత్రలో ఇంటిలిజెన్స్ ప్రమేయంపై యువగళం బృందం.. ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.