ETV Bharat / state

రూ.371 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో బయటపెట్టండి.. సీఎం జగన్​కు టీడీపీ నేతల సవాల్​ - Nakka Anand Babu and Dulipalla

TDP on Skill Development Issue: స్కిల్ డెవలప్​మెంట్ ప్రాజెక్ట్​లో అవినీతి ఆరోపణలపై టీడీప నేతలు స్పందించారు. 4ఏళ్లుగా ఉత్తుత్తి ఆరోపణలతో కొండలు తవ్విన జగన్, ఎలుక తోకను కూడా పట్టుకోలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మతి భ్రమించే జగన్ నిన్న అసెంబ్లీలో 2గంటలపాటు కహానీలు వినిపించాడని ఎద్దేవా చేశాడు. దొంగే.. ‘‘దొంగ దొంగ’’ అన్నట్లుగా జగన్ రెడ్డి నైజం ఉందని దుయ్యబట్టారు. షెల్ కంపెనీలకు రాష్ట్రంలో ఆద్యుడే వైఎస్ జగన్ అని ఎద్దేవా చేశారు.

Nakka Anand Babu
నక్కా ఆనంద్ బాబు
author img

By

Published : Mar 21, 2023, 4:37 PM IST

TDP on Skill Development Issue: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్​పై నాలుగేళ్లుగా ఉత్తుత్తి ఆరోపణలతో కొండలు తవ్విన జగన్.. ఎలుక తోకను కూడా పట్టుకోలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. కట్టుకథలు, కల్లబొల్లి మాటలతో లేని అవినీతిని ఉన్నట్టు ప్రజల్నినమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్​మెంట్ ప్రాజెక్ట్​లో రాష్ట్రవాటా మొత్తం రూ.371 కోట్లు దారి మళ్లితే, ప్రాజెక్ట్ ఎలా అమల్లోకి వచ్చిందని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో 2.94 లక్షల మంది ఎలా శిక్షణ పొందారని నిలదీశారు. 70 వేలమందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయన్నారు.

స్కిల్ డెవలప్​మెంట్ ప్రాజెక్ట్ ఒప్పందం నుంచి అమలు వరకు ప్రధాన పాత్ర పోషించిన ఐఏఎస్​లను ఏపీ సీఐడీ ఎందుకు విచారించడం లేదని నక్కా ఆనంద్​ బాబు ప్రశ్నించారు. ప్రేమచంద్రారెడ్డి, ఎస్.ఎస్.రావత్, ఉదయలక్ష్మి, లక్ష్మీనారాయణ వంటివాళ్లు ముఖ్యమంత్రికి ఎందుకు కనిపించలేని నక్కా ఆనంద్ మండిపడ్డారు. సీమెన్స్ సంస్థ తలుపు సీఐడీ ఇప్పటివరకు ఎందుకు తట్టలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో మతి భ్రమించే జగన్ నిన్న అసెంబ్లీలో 2గంటలపాటు కహానీలు వినిపించాడని ఆక్షేపించారు. 371కోట్లు టీడీపీ నేతల ఖాతాల్లోకి వెళ్తే, ఎప్పుడు వెళ్లాయో, ఎవరి నుంచి ఎవరి ద్వారా వెళ్లాయో వారంలో జగన్ బయటపెట్టాలని సవాల్ విసిరారు. షెల్ కంపెనీల సృష్టించి ప్రజల సొమ్ము కొట్టేసి, దాన్ని తిరిగి కంపెనీల్లోకి రాబట్టుకోవడం జగన్​కు, అతని కుటుంబానికి అవినీతితో అబ్బిన విద్య అని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై మాట్లాడిన నక్కా ఆనంద్ బాబు

'లక్ష కోట్ల అవినీతి చేసి, 43 వేల కోట్ల అవినీతికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. 16 నెలలు జైల్లో ఉన్నాడు. కేవలం చంద్రబాబును కేసులతో ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్నాడు. మెున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీ మీద పడిన ప్రభావాన్ని డైవర్ట్ చేయడానికే జగన్ ప్రయత్నిస్తున్నాడు.'- నక్కా ఆనంద్ బాబు, టీడీపీ నేత

దొంగే.. ‘‘దొంగ దొంగ’’ అన్నట్లు: నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలేస్తాడని నేరగాళ్లే అనడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. దొంగే.. ‘‘దొంగ దొంగ’’ అన్నట్లుగా జగన్ రెడ్డి నైజం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అసలు నేరగాడెవరంటూ పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. 13ఛార్జిషీట్లున్న వ్యక్తి నేరగాడా లేక ఏ ఛార్జిషీట్ లేనోడు నేరగాడా అని నిలదీశారు. రూ 43వేల కోట్లు దోచేశాడని సీబీఐ చెప్పినోడు నేరగాడా, లేక ఏ మరకా అంటని 14ఏళ్ల సీఎం నేరగాడా అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. వ్యవస్థలను నిర్మించినోడు నేరగాడవ్వడనీ, ధ్వంసం చేసినోడే నేరగాడవుతాడని స్పష్టం చేశారు. ఉపాధి కల్పించినోడు నేరగాడో లేక, ఉపాధి పోగొట్టినోడు నేరగాడా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి అందుక్కాదా దేవుడు 16నెలల పాటు 16మొట్టికాయలేసిందని విమర్శించారు. 4దశాబ్దాల ప్రస్థానంలో తెలుగుదేశం ఎందరినో ఎదుర్కొందని గుర్తు చేసిన యనమల, ఇదిరాగాంధీలాంటి ఉక్కుమనిషినే ఎదుర్కొన్న తెలుగుదేశం ముందు జగన్ ఓ పిపీలకమని దుయ్యబట్టారు. ఏపీలో ఒంటరిగాడివెందుకయ్యావో ఆత్మపరిశీలన చేసుకోమని హితవు పలికారు. ఇన్ని కేసులు, ఎన్నో నేరాలు-ఘోరాలున్నాయి కాబట్టే అందరూ జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టారని విమర్శించారు.

  • షెల్ కంపెనీలకు రాష్ట్రంలో ఆద్యుడే వైఎస్ జగన్.

    20 ఏళ్ల క్రితమే షెల్ కంపెనీలు, క్విడ్ ప్రో కో చేసిన వ్యక్తి... నేడు ఆ బురద వేరే వారికి అంటించే ప్రయత్నాన్ని రాష్ట్రం లో ఏ ఒక్కరూ నమ్మరు.

    కిల్ డెవలప్మెంట్ మాత్రమే తెలిసిన జగన్..స్కిల్ డెవలప్మెంట్ ను స్కాంగా ప్రచారం చేయడం వృధా ప్రయాస.… https://t.co/8lVPMXlcls pic.twitter.com/YXVd1lHe06

    — Dhulipalla Narendra Kumar (@DhulipallaNk) March 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

షెల్ కంపెనీ: వైఎస్ జగన్ ది కిల్ డెవలప్​మెంట్​ పాలసీ అంటూ టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. షెల్ కంపెనీలకు రాష్ట్రంలో ఆద్యుడే వైఎస్ జగన్ అని ఎద్దేవా చేశారు. 20 ఏళ్ల క్రితమే షెల్ కంపెనీలు, క్విడ్ ప్రోకో చేసిన వ్యక్తి... నేడు ఆ బురద వేరే వారికి అంటించే ప్రయత్నాన్ని రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మరన్నారు. కిల్ డెవలప్​మెంట్​ మాత్రమే తెలిసిన జగన్, స్కిల్ డెవలప్​మెంట్​ు స్కాంగా ప్రచారం చేయడం వృథా ప్రయాస అని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.